Telugu Mirror: అరటి పండ్లు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు. అందరూ ఇష్టంగా తినే పండ్లలో అరటి పండు కూడా ఒకటి. అరటి పండు లో ఎన్నో పోషక విలువలు ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ ఆరోగ్యకరమైన పండుతో ఆరోగ్యాంగా ఉండే డ్రింక్ ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఆ డ్రింక్ పేరే ‘పెరుగు బననా లస్సి’ (curd banana Lasi). ఇది తాగితే శరీరానికి ప్రశాంతతను మరియు చల్లదానాన్ని ఇస్తుంది. ఈ డ్రింక్ రుచితో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
ఈ డ్రింక్ ను చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు తాగడానికి ఇష్టపడతారు. పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాక ఈ డ్రింక్ తాగితే అలసట మొత్తం పోయి ప్రశాంతంగా ఉంటారు. పిల్లలు ఎంతో ఎంతో ఇష్టంగా తాగుతారు.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ పెరుగు బననా లస్సి (curd banana Lasi) ని ఎలా తాయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు :
1. పావుకేజీ పుల్లటి పెరుగు (curd)
2. ఒక అరటి పండు
3. చెక్కర (sugar)
4. బీట్ రూట్ ఒక టేబుల్ స్పూన్ (beetroot)
5. 2 కప్పుల చల్లటి నీరు (2 cups cold water)
తయారీ విధానం..
ముందుగా పండిన అరటి పండును తొక్క తీసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత మిక్సీ జార్ లో పుల్లటి పెరుగు , అరటిపండు ముక్కలు, పంచదార , చితికెడు ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. ఫ్రిజ్ లో నుండి చల్లటి నీరు తీసుకొని మల్లి ఒకసారి గ్రైండ్ చేసుకొని ఒక గ్లాస్ పోసి మీకు నచ్చిన విధంగా సర్వ్ చేసుకోండి. మీకు నచ్చితే ఐస్ క్యూబ్స్ (ice cubes) కూడా వేసుకోవచ్చు.
ఎంతో రుచికరమైన, హెల్తీ డ్రింక్ ను మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి.