Telugu Mirror: మనిషి పుట్టినప్పటి నుండి ప్రతి విషయాన్నీ అనుభవం (experience) ద్వారా తెలుసుకుంటారు. జీవితంలో మంచి వైపుకి నడవాలన్న లేక చెడు వైపుకి నడవాలన్న మార్పు అనేది అవసరం. ఎప్పటికీ స్థిరంగా ఉండే మార్పు జీవిత గమ్యానికి మరియు కలల ప్రపంచానికి చేరువ చేస్తుంది. ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితం (Happy Life) బలపడేందుకు శారీరకంగా మరియు మానసికంగా అభివృద్ధి చెందడం అవసరం. మన గమ్యం ఎంత చిన్నది అయినా సరే గొప్ప మార్పుతో ప్రారంభిస్తే అనుకున్న ఫలితాన్ని పొందుతారు. మార్పు వల్ల మీ పెరుగుదల మధ్యలో ఆగిపోయిన కలలకు జీవం పోస్తుంది. మరియు మనం జీవిస్తున్న ప్రపంచాన్ని పునరాలోచించమని ఛాలెంజ్ చేస్తుంది. మార్పు ద్వారా మనలో దృఢత్వం, అనుకూలత మరియు కరుణ యొక్క సామర్థ్యాన్నిపెంపొందిస్తుంది. ‘మార్పు’ మొదలయిన కొత్తలో కష్టతరం గా ఉన్న అనుకూలంగా మార్చుకోవడం వలన జీవితంలో గొప్ప బహుమతిని స్వీకరిస్తారు అనే విషయాన్ని గమనించి ముందుకు సాగండి. థెరపిస్ట్ ఇస్రా నాసిర్ యొక్క వ్యాసం ప్రకారం, కొత్త పరిస్థితులతో వ్యవహరించడానికి మరియు సర్దుబాటు చేయడానికి ఆరోగ్యకరమైన వ్యూహాలు, అలాగే మార్పుకు ప్రతిస్పందనగా మీ భావాలను గుర్తించడం మరియు ప్రాసెస్ చేయడం వంటివి దీనిలో భాగమే అని చెప్పుకొచ్చారు.
Also Read: Raksha Bandhan Gifts : ‘రక్షాబంధన్’ కానుకగా మీ సోదరికి సరసమైన ధరలో విలువైన బహుమతులు ఇవ్వండి.
అభివృద్ధి వైఖరిని అభివృద్ధి చేయండి:
అభివృద్ధి చెందే సమయం లో మార్పు అప్పుడప్పుడు కష్టంగా ఉన్నప్పటికీ , మీ కష్టమైన జీవితాన్ని పెట్టుబడిగా పెట్టడం వల్ల అసౌకర్యమైన మార్పులు కూడా విలువైనవని మనం అర్థం చేసుకోగలుగుతాం.
స్పష్టమైన లక్ష్యాలు మరియు ప్రణాళికలను రూపొందించండి:
ముందుగా సాధించాల్సిన లక్ష్యాన్ని ఒక నిర్దిష్ట సమయ వ్యవధిలో ఉండడం మరియు ఒక వ్యూహాన్ని కలిగి ఉండటం వల్ల మన లక్ష్యానికి చేరువలో అవుతామనే విషయాన్నీ గ్రహించండంలో తోడ్పడుతుంది. ఒక ప్రణాలికను సిద్ధం చేసుకోవడం వల్ల జీవితం లో ఏ విషయాల పై ఎక్కువ శ్రద్ధ చూపాలి ఇంకా ఏ విషయాలను వదిలేయాలి అనే ఆలోచనలపై అవగాహన కలిగిస్తుంది.మీ లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో మీరు విశ్వసించే వ్యక్తులతో లక్ష్యాలను సంభాషించి వారి సహాయాన్ని పొందండి.
చర్య తీసుకోండి:
పనులు నిశ్చితంగా జరుగుతాయిలే అని రిలాక్స్ మోడ్ లో ఉండి నిర్లక్ష్యంగా ప్రవర్తించకూడదు. పనులు జరుగుతాయి అని అనుకునే బదులు వెంటనే ఆ దిశగా వెళ్లడం ప్రారంభించాలి.చేసే పని చిన్నదైనా ,పెద్దదైన లక్ష్యం కోసం పని చేస్తున్నంత వరకు మనం పురోగతి సాధిస్తాం అనే గుర్తుచేస్తుంది. చిన్న విజయాన్ని అయినా గుర్తించాలి ఎందుకంటే ఆ విజయాలు మనల్ని ముందుకు సాగడానికి సహాయపడతాయి.