Telugu Mirror: చంద్రయాన్-3 సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఆగస్టు 23ని ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా ప్రకటించారు. బెంగళూరు లో ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) శాస్త్ర వేత్తలతో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ ఒక తరానికి స్ఫూర్తినిచ్చి యువ మనసులపై చెరగని ముద్ర వేసినందుకు బెంగళూరులోని ఇస్రో శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోడీ చంద్రయాన్ -3 సాధించిన విజయానికి ప్రతీకగా ఆగష్టు 23 ని ‘నేషనల్ స్పేస్ డే’ గా ప్రకటించారు.
విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) విజయవంతమైన ల్యాండింగ్‌ను పురస్కరించుకుని ల్యాండింగ్ అయిన ప్రదేశానికి ప్రధాని మోదీ ‘శివశక్తి’ అని పేరు పెట్టారు. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్‌లో జరిగిన ప్రసంగంలో ప్రధాని ఈ విషయాన్ని ప్రకటించారు.
2019 లో చంద్రుడి పై chandrayaan-2 ల్యాండ్ అయిన విషయాన్ని ప్రధాని గుర్తు చేస్తూ ఇది భారత దేశం చంద్రుని ఉపరితల అన్వేషణ విజయాలకు స్ఫూర్తిగా నిలిచింది అని ప్రధాని మోడీ అన్నారు. చంద్రయాన్-2 ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయిన ప్రదేశాన్ని ప్రధాని మోదీ ‘తిరంగా పాయింట్’ గా పిలిచారు.
‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’ ప్రకటన మరియు చంద్రుని పై ల్యాండింగ్ అయిన స్థానాల కు పేరు పెట్టడం భారతదేశం యొక్క పెరుగుతున్న అంతరిక్ష అన్వేషణ పరాక్రమాన్ని మరియు ప్రజలలో శాస్త్రీయ పరిశోధనల పట్ల ఉత్సాహాన్ని పెంచడంలో ఇస్రో యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తుంది.
“మీరు చంద్రునిపైకి ‘మేక్ ఇన్ ఇండియా’ (Make In India) ను తీసుకెళ్లారు,” అని పిఎం మోడీ భారతదేశం యొక్క మూన్ మిషన్ విజయానికి కారకులైన శాస్త్రవేత్తలపై ప్రశంశల జల్లు కురిపించారు.
“మీరు ‘మేక్ ఇన్ ఇండియా’ను చంద్రుని ఉపరితలానికి విస్తరించారు. అందుకోసమై మీరు చేసిన కఠోర శ్రమను నేను దేశ ప్రజలతో పంచుకోవాలనుకుంటున్నాను. దక్షిణ భారతదేశం నుండి చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరుకోవడం సులభమైన మార్గం కాదు. కృత్రిమ చంద్రుడు మరియు విక్రమ్ ల్యాండర్ వివిధ మార్గాల్లో ల్యాండ్ అయ్యాయి. విజయం ఖాయమైంది. మీ సాఫల్యం భారతదేశ యువతకు స్ఫూర్తినిచ్చింది, ఇది అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మిస్తుంది. భారతదేశం ఆగస్టు 23న చంద్రునిపై తమ జెండాను ఎగుర వేసింది. ఆ రోజునే ఇప్పుడు భారతదేశంలో ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’ గా జరుపుకుంటామని ప్రధాని మోదీ ప్రకటించారు.