Apple Airtag: యాపిల్ ఎయిర్ ట్యాగ్..ఇక దొంగలు తప్పించుకోలేరు..

Telugu Mirror:మానవమేధస్సు తో సృష్టించిన పరికరాలు తిరిగి అదే మానవునికి సహాయకారిగా మారడమే కాకుండా మానవ ఆలోచనలకు మించిన ప్రతిభ కలిగి ఉంటున్నాయి.ఎన్నో సార్లు ఈ విషయాలు రుజువయినాయి.అయితే తాజాగా Apple కంపెనీ యొక్క AirTag తో జరిగిన సంఘటన వార్తలలో వినబడుతోంది.
Apple కంపెనీ AirTag యొక్క ఊహించని బహుముఖ తెలివితేటల వలన మరణించిన వారి యొక్క సమాధులలో విలువైన వస్తువులను దొంగిలిస్తున్న దొంగల ను పట్టుకోవడంలో Apple AirTag ఒక కుటుంబానికి సహాయం చేసింది. వివరాలలోకి వెళితే..

హ్యూస్టన్ లోని స్థానిక వార్తా ప్రచురణ సంస్థ అయిన Click2 కధనం ప్రకారం,టెక్సాస్ లోని హ్యూస్టన్ లో నిరంతరం శ్మశానవాటికలోని సమాధులలో దోపిడీల వలన అనేక కుటుంబాలు కష్టాలను ఎదుర్కుంటున్నాయని ప్రచురించారు. ఈ దొంగలు శ్మశాన వాటికలలోని సమాధులను లక్ష్యంగా చేసుకుని వాటిని వెలికి తీసి కుండీల వంటి విలువైన వస్తువులను దోచుకుంటున్నారని.ముఖ్యంగా బ్రజోరియా కౌంటీ సమాధుల దొంగల చర్యలకు ప్రభావితమైందని,ఇక్కడ వందల సంఖ్యలో సమాధులు దొంగతనానికి గురయ్యాయని,ఫలితంగా పదివేల డాలర్ల విలువకలిగిన కాంస్య కూజాలను కోల్పోయారని Click2 నివేదించింది.n

OnePlus:తగ్గేదేలే అంటున్న వన్ ప్లస్ అప్ కమింగ్ ఫోన్

సమాధులలో వరుస దోపిడీలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకునే ప్రయత్నంలో, ఒక కుటుంబం తెలివిగా టెక్నాలజీని ఉపయోగించి కుండీలో ఎయిర్ ట్యాగ్ ను ఉంచింది. Click2తో టోనీ వెలాజ్ క్వెజ్ మాట్లాడుతూ టెక్సాస్ లోని క్లూట్ లో గల రెస్ట్ వుడ్ మెమోరియల్ పార్క్ లో దివంగతుడైన తన మేనమామ విశ్రాంతి తీసుకునే సమాధిని వివిధ సందర్భాలలో దొంగలు పదే పదే లక్ష్యంగా చేసుకుని పలుమార్లు దొంగతనానికి పాల్పడ్డారని టోనీ వెలాజ్ క్వెజ్ ప్రచురణ సంస్థతో తెలిపాడు. సమాధిపై స్మారకంగా ఉంచిన $600(రూ.49,236) విలువైన కూజాతో నేరస్తులు దొరికారు.

విలువైన వేజ్ ని దొంగిలించడం కోసం దొంగలు వస్తారని ముందుగానే ఊహించిన వెలాజ్ క్వెజ్ ఖరీదైన వేజ్ (Vese) లోపల AirTagని ఉంచాలని నిర్ణయించుకొని తన పధకాన్ని అమలు చేసినాడు. అతను ఊహించిన విధంగానే దొంగలు సమాధిపై ఉంచిన వేజ్ ను దొంగిలించారు. కుండీ దొంగిలించిన విషయాన్ని దానిలో ఏర్పరచిన ఎయిర్ ట్యాగ్ గురించి అధికారులకు సమాచారం అందించాడు వెలాజ్ క్వెజ్. అధికారులు ట్రాక్ చేయగా 45 నిమిషాల దూరంలో ఉన్న ఒక నివాసానికి ట్రాక్ చూపించింది.పోలీస్ అధికారులు మాట్లాడుతూ వారు మాకు లాగిన్ సమాచారాన్ని అందించారు అలాగే దానిని ట్రాక్ చేసేందుకు కూడా అనుమతించారు. మేము ట్రాక్ చేసి బ్రజోరియా పట్టణం వెలుపల ఉన్న ఇంట్లో గుర్తించినట్లు తెలిపారు.

iQOO 11S తో iQOO TWS 1 ఇయర్ బడ్స్..ఒకేసారి రిలీజ్..అదిరే ఫీచర్ లు,ఆకర్షణీయమైన రంగులలో

క్లూట్ పోలీస్ చీఫ్ జేమ్స్ ఫిచ్ మాట్లాడుతూ దొంగలు లాభాపేక్షతో స్థానిక స్క్రాప్ యార్డ్ లో కుండీలను త్వరగా విక్రయించాలని చూసారని, గత రెండు నెలలలో మొత్తం 102 కూజాలను దొంగలు అపహరించారని, వాటి మొత్తం రికవరీ చేసినట్లు తెలిపాడు.చట్టాన్ని అమలు పరచి దొంగలను పట్టుకోవడానికే కాకుండా $62,000(రూ.50,95,265) విలువైన స్మారక కుండీలను తిరిగి పొందడంలో సహాయం చేయడం ద్వారా Apple యొక్క AirTag అందరినీ ఆశ్చర్యపరచింది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in