Telugu Mirror : కొంతమందికి తీపి పదార్థాలు ( Sweets)అధికంగా తినే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ఆరోగ్యానికి అనేక రకాలుగా నష్టం కలగజేస్తుంది. తీపి పదార్థాలు అధికంగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీనిని సకాలంలో నియంత్రించకపోతే అది టైప్ -2 డయాబెటిస్(Diabetes) ప్రమాదాన్ని పెంచుతుంది . చక్కెర పదార్థాలు అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల మధుమేహంతో పాటు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం మరియు మానసిక ఆరోగ్య సమస్యలను కూడా వృద్ధి చేస్తాయి. ప్రతి ఒక్కరు ఆహారంలో తీపి పదార్థాలను తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మీలో ఎవరికైనా తరచుగా తీపి పదార్థాలు తినే కోరిక ఉన్నట్లయితే దీని పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. తీపి పదార్థాలు తినాలి అనే కోరిక కొంత మంది వ్యక్తులలో అధికంగా ఉంటుంది. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరియు కొంతమందికి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కలిగి ఉండటం వల్ల కూడా తీపి పదార్థాలు తినాలనే కోరిక కలుగుతుంది. వారు ఈ విషయంలో ఖచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి. తీపి పదార్థాలు తినాలనే బలమైన కోరిక ఎందుకు కలుగుతుందంటే, ఇది మీ మెదడు యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటుంది.
మీ టెంపోరల్ లోబ్ లోని హిప్పో కాంపస్ జ్ఞాపకాలను (మెమోరీస్) నిల్వ చేయడానికి బాధ్యత తీసుకుంటుంది. మిల్క్ చాక్లెట్(Milk chocolate) మరియు డార్క్ చాక్లెట్ రుచిని గుర్తించుకోవడం కోసం హిప్పో కాంపస్ దీని యొక్క క్రియాశీలత స్థితి కొన్ని రకాల ఆహార పదార్థాలను తినాలనే కోరికను కలిగిస్తుంది. మీకు అతిగా తీపి తినాలి అని అనిపిస్తే దానిని మీరు తీవ్రంగా ఖండించాలి.సెరో టోనిన్ సిద్ధాంతం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే, సెరో టోనిన్ అనేది ఆహార కోరికలకు సంబంధించినది. సెరోటోనిన్ మానసిక స్థితిని నిర్వహించడానికి అవసరమైన న్యూరో ట్రాన్స్మిటర్.
Rose Water : ఇంట్లోనే రోజ్ వాటర్ తయారీ, ముఖం క్లీన్, లుక్ ఎవర్ గ్రీన్ కోసం వీటిని తయారు చేసుకోండి.
సెరోటోనిన్ యొక్క అసమతుల్యత వల్ల డిప్రెషన్(Depression) ప్రమాదాన్ని అధికం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. మీకు స్వీట్లు మరియు పిండి పదార్థాలు తినాలని బలంగా అనిపించినప్పుడు సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచేలా చేస్తుంది. దీని వలన మీకు అటువంటి ఆహార పదార్థాలు తినాలనే భావన కలుగుతుంది.తీపి పదార్థాల మీద వ్యామోహం కలగడం ఆరోగ్యానికి అంతా మంచిది కాదని దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య వైద్యులు చెబుతున్నారు. అధికంగా చక్కెర ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. దీంతో పాటు డయాబెటిస్ మరియు అనేక రకాల ఆరోగ్యపరమైన సమస్యలు వేగంగా వచ్చే అవకాశం ఉంది అని వైద్యులు అంటున్నారు.
కాబట్టి తీపి పదార్థాలు తినాలనే కోరిక అధికంగా ఉన్నవారు తప్పకుండా వైద్యుడుని సంప్రదించాలి. ప్రతి ఒక్కరు కూడా చక్కెరను తగిన పరిమాణంలో వినియోగించడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.