Telugu Mirror: జీవితం అనే ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు వస్తున్నప్పటికీ దానిని దాటుకొని ముందుకు వెళ్తూనే ఉంటాం. జీవితం లో నిజమైన సంతోషం, సుఖం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మరి ఆ జీవితాన్ని పొందాలంటే దిన చర్య (Daily Life) లో మనం చేసే పనులు ఏ విధంగా ఉండాలో కొన్ని చిట్కాల ద్వారా చెప్పబోతున్నాం. అవేంటో ఒకసారి చూద్దాం.
మొదటగా మీరు మీకు ప్రాధాన్యతని ఇవ్వండి.
మీ జీవితం సంతోషంగా ఉండాలంటే దానికి మొదటి మెట్టు మీరు మీరే ప్రాధాన్యతను ఇచ్చుకోవాలి. ఎందుకంటే మీ జీవితం జరిగే ప్రతి పనికి మీ రే బాధ్యత వహిస్తారు కాబట్టి. సంతోషంగా ఉండేందుకు మీకు ప్రాధాన్యత ఇచ్చుకోవడం చాల ముఖ్యం. మీ యొక్క అభిరుచులు , ఆసక్తి కలిగించే పనులను చేసినందుకు వెనకాడకండి. మిమ్మల్ని మీరు మొదటి స్థానం లో ఉంచుకున్నప్పుడే మీరు ఆనందంగా మరియు సంతృప్తి చెందిన భావన కలిగి ఉంటారు. పని చేసి అలసి పోయి ఉంటే ఒక కప్ టీ (Tea) తాగి ఒంటరిగా గడపడం లో తప్పు లేదు. మీకు సంతోషాన్నీ కలిగించే చిన్న చిన్న పనులు చేస్తే మరింత సంతృప్తినీ చెందుతారు. ఇతరులతో పోల్చుకోకూడదు మరియు మీ లక్ష్యాన్ని సాదించేందుకు ఎల్లవేళలా ప్రయత్నం చేసుకోండి.గతం లో చేసిన తప్పులను మీ అంతరాత్మకు మీరే సమాధానం చెప్పుకోవడం వల్ల కోపం, ఆందోళన తగ్గే అవకాశం ఉంటుంది. మీ జీవితాన్ని మీరే సానుకూలంగా చూసుకోవాలి మరియు మీ గుండెల్లో ధైర్యాన్ని నింపుకోవాలి.
మీరు కొత్త పని చేసేందుకు ప్రయ్నతించండి.
గతం లో చేయని కొత్త పనులను ఇప్పుడు చేసేందుకు సిద్ధమవ్వండి . కొత్త విషయాలు తెలుసుకోవడం మరియు మునుపెన్నడూ చేయని పనులు చేయడం ద్వారా మీరు మరింత ఆనందంగా మరియు ఆహ్లాదకరంగా భావిస్తారు.కొత్త విషయాలను అనుభవిస్తే దానిలో ఉండే సంతోషం వల్ల మీకు రెట్టింపు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కాబట్టి కొత్త అన్వేషణల కై కొంత సమయాన్నిపెట్టడం మంచిదే. ఉదాహరణకి,
1.ఇంత ముందు మీరు వెళ్లని రెస్టారెంట్ (Restaurant) కి వెళ్లి ఎప్పుడూ తినని ఫుడ్ ని తిని ఆస్వాదించండి.
2.కొత్త ఆట ను ఆడే ప్రయత్నం చేయండి.
3.కొత్త ప్రదేశానికి వెళ్ళడం వలన మీ ఆనందాన్ని మెరుగుపరుస్తుంది.
మీకు తెలియని విషయాల గురించి నేర్చుకోవాలనే ఆంక్షతో ఉండండి.
సమాజం లో ఎదగాలంటే మీకు అంటూ ఒక గుర్తింపుని తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మీ ఎదుగుదల కోసం కొత్త నైపుణ్యాల (skills) ను మరియు అభిరుచులను నేర్చుకోండి. ఈ లోకం లో కొత్త విషయాలు , జ్ఞానాన్ని పెంపొందించడానికి బోలెడు అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కొత్త విషయాన్నీ కనుకొన్నప్పుడు మీరు ఆత్మ స్థైర్యం తో నిండి ఉండటం గమనించే ఉంటారు. అలా చేయడం వలన మరింత ఆనందాన్ని పొందుతారు. సోషల్ మీడియా లో ఆసక్తి గా ఉన్న విషయాలను చదవండి మరియు చూడండి. లోకం లో జరిగిన మరియు జరుగుతున్న విషయాలపై అవగాహన కలిగి ఉండండి. లైబ్రరీ(Library) కి వెళ్లి పుస్తకాలు చదవండి మరియు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి. కాలేజీ పిల్లలు అయితే కొత్త భాష నేర్చుకునేందుకు మరియు కాలేజీ లో జరిగే ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం లాంటివి చేయడం ఉత్తమం.
మీ ముఖం పై ఎల్లప్పుడూ చిరు నవ్వుని కలిగి ఉండండి.
ముఖం వచ్చే చిరు నవ్వు మీ లోని భావాన్ని మార్చగలదని మీకు తెలుసా ? ఇది నిజం. అందుకే మీరు ఎల్లప్పుడూ చిరు నవ్వుతోనే మీ రోజుని ప్రారంభించడం మంచిది. నవ్వుతూ ఉండడం వల్ల మీరు మానసిక ఆనందాన్ని మరియు ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. పరిశోధనల ప్రకారం , నవ్వడం ఒక యోగ లాంటిది. మీ నవ్వు ఇతరులకి కూడా మంచి అనుభవాన్ని ఇస్తుంది కాబట్టి నవ్వుతూ ఉండండి. అలా అని మిమ్మల్ని మీరు వెర్రిగా, మీపై నిర్లక్షంగా ఉండకండి.
సోషల్ మీడియా (Social Media) లో సరదాగా ఉండేందుకు ఫన్నీ వీడియోలు చూడడం మంచి పని. అలా చేస్తే కొంత సమయం వరకు మీరు మీకున్న ఒత్తిడిని మర్చిపోగలుగుతారు. మీ స్నేహితులతో జోకులు వర్షం కురిపిస్తూ సంతోషంగా గడపండి.
వ్యాయామం చేయడం మర్చిపోవద్దు.
వ్యాయాయం (Exercise) శరీరానికి ఎంత ఆరోగ్యమో మనందరికీ తెలుసు. ప్రతి రోజు వ్యాయామం చేయడం వల్ల మీలో ఉన్న ఒత్తిడి (stress) భావం తగ్గిపోతుంది. ఎన్ని ఆరోగ్య సమస్యలను అనగా గుండె పోటూ (Heart Attack) , రక్త పోటూ(Blood Pressure) , కాన్సర్ లాంటి వ్యాధులతో పోరాడడమే కాకుండా మానసిక స్థితిని ఉల్లాసంగా ఉంచేందుకు దోహదపడుతుంది. శారీరకంగా ఉత్తేజం పొందడం వల్ల అధిక శక్తిని పొందుతారు మరియు ఫిట్ గా ఉంటారు.
పోషకమైన ఆహరం తీసుకోండి.
ఆరోగ్యం మెరుగుపడాలంటే మంచి ఆహరం (Healthy Food) తీసుకోవాలి. సరియైన ఆహరం తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలిసిన విషయమే. అనారోగ్యానికి గురికాకుండా ఉండేందుకు పోషకవిలువలతో కూడిన ఆహరం తీసుకోవడం వల్ల అదనంగా మొత్తం శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. అప్పుడప్పుడు వంట చేయడం వల్ల కూడా సరదాగా మంచి అనుభూతి చెందవచ్చు. అన్ని రకాల పండ్లు , కూరగాయలు , బ్రెడ్ , పాస్తా, చిరు ధాన్యాలు ఎంపిక చేసుకోవడం మంచిది. ఇంకా మంచి ఆరోగ్యాన్ని పొందడానికి డాక్టర్ యొక్క సలహా తీసుకోండి.
తగినంత నిద్ర ఒంటికి మంచిది.
ప్రతి మనిషికి నిద్ర చాల అవసరం. తగినంత నిద్ర (sleep) లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదురుకుంటాం.పెద్దవారికి రోజుకి 7 నుండి 8 గంటలు నిద్రించడం వలన ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు మీ మెదడు చురుగ్గా పని చేస్తుంది. అదే పిల్లల్లో 8 నుండి 13 గంటల నిద్ర అవసరం. వ్యాయామం చేయడం వల్ల మీరు ప్రశాంతమైన విశ్రాంతిని పొందడానికి సహాయపడుతుంది.