Telugu Mirror: భారతదేశం (india) లో అత్యంత ఇష్టపడే పండ్లలో కొబ్బరి కాయలు (coconut)ఒకటి. భారత దేశంలో ప్రతి ఏటా కొబ్బరి ఉత్పత్తి అధికంగానే ఉంటుంది. దేశంలో అనేక రకాల వంటలలో కొబ్బరి కాయ లోపలి కోప్రా (coconut copra) అనబడే మాంసాన్ని ఉపయోగిస్తారు దీనినే ఎండోస్పెర్మ్ అని కూడా అంటారు. కొబ్బరికాయతో తియ్యని వంటకాలు చేస్తారు. కొబ్బరికాయను ఉపయోగించి కొబ్బరి తాడులను తయారు చేయడం వరకు ప్రతి కొబ్బరికాయను ఉపయోగిస్తారు కొబ్బరి అత్యంత పోషకమైన ఆహారం కూడా. ప్రతి సంవత్సరం, ఈ కొబ్బరి ఉపయోగాలను తెలుసుకోవడానికి అలాగే కొబ్బరి పండుపై అవగాహన పెంచడానికి ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని (coconut day) జరుపుతారు. భారతదేశంలో కొబ్బరిని పండించే ప్రథాన రాష్ట్రాలలో తమిళనాడు (TamilNadu), కర్ణాటక (Karnataka), కేరళ (Kerala), పశ్చిమ బెంగాల్ (West Bengal) మరియు ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) లు ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన రోజును జరుపుకునే సందర్భంలో కొన్ని గుర్తు పెట్టకోవాల్సిన వాస్తవాలు ఉన్నాయి వాటిని తెలుసుకుందాం.
తేదీ:
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని (International Coconut Day) నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 2నే ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని జరుపుకోనున్నారు.
చరిత్ర:
ఇండోనేషియా (Indonesia) లోని జకార్తా (Jakarta) లో ప్రధాన కార్యాలయం కలిగిన ఆసియా మరియు పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ (APCC), ఇండోనేషియా లోని జకార్తాలో ప్రథాన కార్యాలయం కలిగి ఉంది. దీనిని 1969 లోనే ఆసియా దేశాలలో కొబ్బరికాయల పెరుగుదల, ఉత్పత్తి, అమ్మకం మరియు ఎగుమతి కోసం స్థాపించబడింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని నిర్వహించాలనే కార్యక్రమాన్ని 2009లో APCC మొదలుపెట్టింది. APCC లో భారతదేశం, మలేషియా,ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, థాయిలాండ్, కెన్యా మరియు వియత్నాం ది ఏషియా అండ్ పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ(APCC)లో సభ్య దేశాలుగా ఉన్నాయి.
ప్రాముఖ్యత:
వరల్డ్ కోకోనట్ డే (ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని) ని రైతులు మరియు కొబ్బరి పండించే వ్యాపారంలో ఉన్న వాటాదారులు జరుపుకుంటారు. ప్రజలు కొబ్బరికాయలను వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కలిగించడం మరియు ఇతర ఈవెంట్స్ తో ఆ రోజున ప్రణాళిక సిద్ధం చేస్తారు.
కొబ్బరి వల్ల కలిగే ప్రయోజనాలు:
కొబ్బరి మాంసాన్ని కెర్నల్ అని కూడా పిలుస్తారు,కొబ్బరి తినడానికి అద్భుతంగా ఉంటుంది. ఎన్నో ప్రయోజనాలతో నిండిన కొబ్బరికాయలను వివిధ రకాల వంటలలో ఉపయోగిస్తారు. కొబ్బరి పాలు (Coconut Milk) మరియు నూనె కూడా పండు నుండి తీస్తారు. కొబ్బరిని వంటకాల లోనే కాకుండా జుట్టు మరియు ముఖానికి పోషణ కోసం కూడా ఉపయోగిస్తారు. వంటకాలలో వాడే ఇతర వంట నూనెలకు కొబ్బరి నూనె ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. కొబ్బరి పాలు అనేక రకాల వంటలలో చాలా ముఖ్యమైన అంశం. కొబ్బరి నీరు కూడా ఆరోగ్యం కోసం అద్భుతమైన పానీయం. కొబ్బరి కాయను తాళ్లు, రగ్గులు మరియు తలుపుల తయారీలో కూడా ఉపయోగిస్తారు.