Telugu Mirror: ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. పండ్లు తినడం వల్ల శరీరానికి పోషణను అందిస్తాయి.
పండ్లలో విటమిన్లు, మినరల్స్ మరియు ప్రోటీన్లు (Proteins) వంటి పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయి. ప్రతిరోజు పరగడుపున ఆపిల్ (Apple) తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆపిల్ మాత్రమే కాకుండా మిగిలిన అనేక రకాల పండ్లలో కూడా పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.
ఆరోగ్యకరమైన పండ్లలో అరటిపండు (Banana) కూడా ఒకటి. రోజుకు ఒక అరటిపండు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అరటిపండ్లు విటమిన్స్ మరియు పోషకాలను కలిగి ఉన్నాయి. అరటి పండ్లలో ఉండే కార్బోహైడ్రేట్లు, విటమిన్- ఎ, విటమిన్ -సి మరియు విటమిన్ బి6, ఐరన్, ఫాస్ఫరస్ మెగ్నీషియం, సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా అరటిపండు లో ఉన్నాయి.
ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి ఇవే కాకుండా గ్లూకోజ్ మరియు సహజ చక్కెర లు కూడా ఉన్నాయి. అరటిపండును సూపర్ ఫుడ్ గా కూడా పరిగణించవచ్చు అయితే అరటి పండ్లను తినడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అరటి పండ్లు తినడం వల్ల కలిగే ఉపయోగాలు మరియు నష్టాలు గురించి తెలుసుకుందాం.
అరటిపండు తినటం వల్ల ఉపయోగాలు:
- అరటి పండ్లలో పొటాషియం (Potassium) ఉంటుంది. కాబట్టి వ్యాయామం చేసిన తర్వాత అరటి పండ్లను క్రమం తప్పకుండా తినాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది.
- అరటిపండ్ల లో విటమిన్ b6 (Vitamin – B6) ఉంటుంది. దీని వలన మెదడు యొక్క శక్తిని పెంచుతుంది. మరియు జ్ఞాపకశక్తిని (Memory Power) మెరుగుపరుస్తుంది.
- అరటి పండును తినడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాన్సర్ మరియు రక్తపోటుని నియంత్రిస్తుంది.
- దీనిని తీసుకోవడం వల్ల మలబద్ధకం మరియు పొట్ట సమస్యలను తొలగిస్తుంది .
- దీనిలో ఏమైనా యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల హార్మోన్ల స్థాయిని సక్రమంగా ఉంచుతుంది తద్వారా మానసిక స్థితి చక్కగా ఉంటుంది.
- దీన్ని తినడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది.
అరటిపండు తినడం వల్ల నష్టాలు:
- అరటి పండ్లలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఇవి బరువును పెంచేలా చేస్తాయి. కాబట్టి అధిక బరువు ఉన్నవారు అరటి పండ్లను తినడం తగ్గించాలి.
- అరటి పండ్లలో ప్రోటీన్ (Protein) తక్కువగా ఉంటుంది . కాబట్టి వీటిని తినడం వల్ల కండరాలు బలహీనపడతాయి.
- వీటిని తినడం వల్ల కడుపులో గ్యాస్ ఇబ్బందిని కలిగిస్తుంది.
- కిడ్నీలు సరిగా పనిచేయని వారు వీటిని తినడం తగ్గించాలి. ఎందుకంటే వీటిల్లో ఉండే పొటాషియం కిడ్నీల (Kidneys) పై భారం పడేలా చేస్తుంది.
- కాబట్టి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు ప్రతిరోజు అరటిపండు తినవచ్చు.