Telugu Mirror: బయట నుండి వచ్చిన ప్రతిసారి ముఖాన్ని (Face) శుభ్రం చేసుకుంటూ ఉంటాము. ఎందుకనగా వాతావరణం లో ఉండే దుమ్ము, ధూళి చర్మంపై పేరుకుపోయి ఉంటుంది. కాబట్టి బయట నుంచి ఇంటికి రాగానే ప్రతి ఒక్కరు కాళ్ళు, చేతులు మరియు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మురికి పోతుంది. అయితే ప్రస్తుతం మార్కెట్ లో అనేక రకాల ఫేస్ వాష్ (face wash) లు అందుబాటులో ఉన్నాయి. వీటిని వాడటం వల్ల చర్మాని (Skin) కి ప్రయోజనాలను అందిస్తాయి.
కానీ ముఖాన్ని ఎక్కువసార్లు ఫేస్ వాష్ లను ఉపయోగించి కడగడం వల్ల ముఖంపై వివిధ రకాల సమస్యలు వస్తాయి. ఫేస్ వాష్ లను పదేపదే వాడటం వల్ల ముఖం గరుకుగా మారడం మొదలవుతుంది. అలాగే పొడి చర్మం (Dry skin) గా కూడా మారుతుంది.ఫేస్ వాష్ లను వాడేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది .
ఫేస్ వాష్ ని ఉపయోగించి ముఖాన్ని కడుక్కోవడం చాలా తేలికైన పనిలా అనిపిస్తుంది. అయితే తెలిసి తెలియక కొన్ని తప్పులు చేయడం వల్ల చర్మం దెబ్బతింటుంది. కాబట్టి ఈరోజు ఫేస్ వాష్ వాడే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
Also Read: రాజకీయాల్లోకి సమంత ఎంట్రీ ఇవ్వనుందా ,ఆ పార్టీ తరపున ప్రచారం చేయనుందా?
ఫేస్ వాష్ కొనేటప్పుడు చర్మ తత్వాన్ని బట్టి కొనాలని విషయాన్ని గుర్తుంచుకోవాలి మీ చర్మానికి సరిపడని ఫేస్ వాష్ఉపయోగించినప్పుడు దాని ప్రభావం చర్మంపై పడుతుంది. కాబట్టి మీరు ఫేస్ వాష్ కొనాలి అనుకున్నప్పుడు మీ చర్మ రకాన్ని చెక్ చేసుకోవాలి.
ఫేస్ వాష్ వాడే సమయంలో అధికంగా వేడి ఉన్న నీటితో చర్మాన్ని కడగకూడదు. బాగా వేడిగా ఉన్న నీళ్లతో చర్మాన్ని కడగడం వల్ల చర్మం పొడిబారే అవకాశం ఉంటుంది.
ఫేస్ వాష్ ని ఉపయోగించి ముఖం పై బలంగా రుద్దకూడదు. అది మీ చర్మాన్ని డ్యామేజ్(Damage) చేస్తుంది.
రోజు మొత్తంలో రెండు సార్లు మాత్రమే ఫేస్ వాష్ ను వాడాలి. ఎక్కువసార్లు వాడడం వల్ల చర్మం పొడిగా మారుతుంది.
ఫేస్ వాష్ తర్వాత శుభ్రమైన కాటన్ (Cotton) టవల్ ను ఉపయోగించాలి. మురికిగా ఉన్న టవల్ని వాడటం వల్ల చర్మంపై చెడు ప్రభావం పడుతుంది
కొంతమంది ఫేస్ వాష్ తర్వాత వెట్ వైప్స్ (Wet wipes) ని పదే పదే వాడుతుంటారు. దీనిని ఎక్కువగా వినియోగించడం వల్ల చర్మానికి హాని కలిగిస్తుంది.
కనుక ఫేస్ వాష్ ఉపయోగించేవారు ఇటువంటి కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.