మీకు మధుమేహ సమస్య ఉందా అయితే ఈ ఫుడ్ అస్సలు తినకండి,మీ డైట్ ఎలా ఉండాలంటే

If you have diabetes problem then don't eat this food at all, how should your diet be
Image Credit : Healthkart

Telugu Mirror : మధుమేహ సమస్య ఈ రోజుల్లో విపరీతంగా పెరిగిపోతుంది. ఇది దీర్ఘకాలిక సమస్య కాబట్టి జాగ్రత్తగా వహిస్తూ ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యాన్ని సమర్థవంతంగా నియంత్రించడానికి మరియు రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించడానికి ఆహారం పై నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం.

కూరగాయలు, తృణధాన్యాలు మరియు ప్రొటీన్లు (Protines)  అధికంగా ఉండే ఆహారాన్ని సమతుల్యంగా కలిగి ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. అయితే, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మధుమేహ వ్యాధిగ్రస్తులు దూరంగా ఉండవలసిన ఆహార పదార్ధాలు చాల ఉన్నాయ్. అవేంటో చూద్దాం.

చక్కెర పానీయాలు మరియు కాంప్లెక్స్ పిండి పదార్థాలు రక్తంలో చక్కెరపై తక్షణ ప్రభావాలు చూపుతాయి కాబట్టి వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండాలి. అంతేకాకుండా, సాచురేటెడ్ మరియు ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిస్‌ దీర్ఘ కాలిక సమస్య కాబట్టి జాగ్రత్తగా నిర్వహించాలి.

Also Read : విట మిన్ లు కలిగిన ఆహారం , సరైన వ్యాయామం బలమైన రోగనిరోధక వ్యవస్థకు ఆధారం

1) అధిక చెక్కర కలిగిన పానీయాలు
మీరు చక్కెరతో కూడిన ఆహార పదార్ధాలు తినడం లేదా తీపి పానీయాలు తాగితే మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. మీకు మధుమేహం ఉన్నట్లయితే, కాలక్రమేణా రక్తంలో చక్కెర అధికంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. మీరు మీ శరీరంలోని కార్బోహైడ్రేట్ స్థాయిని స్థిరంగా ఉంచుకోవాలనుకుంటే చక్కెర కంటే కూరగాయలను ఎంచుకోవడం మంచిది. చక్కెరను పూర్తిగా నివారించడం కూడా మంచిది కాదు. అప్పుడప్పుడు తక్కువ మొత్తంలో చక్కెర (Sugar) తీసుకోవడం మంచిది. కాఫీ, సోడా మరియు మిల్క్‌షేక్‌లతో సహా పానీయాలకు దూరంగా ఉండాలి.

If you have diabetes problem then don't eat this food at all, how should your diet be
Image Credit : Healthkart

2) తెల్ల రొట్టె
మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, వైట్ బ్రెడ్‌ను పూర్తిగా నివారించాలి. వైట్ బ్రెడ్‌లో తెల్ల పిండి మరియు శుద్ధి చేసిన పిండి పదార్థాలు ప్రధానంగా ఉంటాయి. తయారీ ప్రక్రియలో ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలను తొలగించడం వల్ల వైట్ బ్రెడ్‌లు అధిక గ్లైసెమిక్ ను కలిగి ఉంటాయి. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు తక్కువ విలువ కలిగిన వాటి కంటే మీ రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా మరియు గణనీయంగా పెంచుతాయి.

3) వేయించిన ఆహార పదార్ధాలు
ఫ్రై తో కూడిన ఆహారానికి దూరంగా ఉండాలి. సాధారణ పిండి పదార్థాలు మరియు కొవ్వులు వేయించిన వంటకాల్లో పుష్కలంగా ఉంటాయి. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, వాటిని తీసుకోవడం చాలా ప్రమాదకరం. కొవ్వు నెమ్మదిగా జీర్ణమవుతుంది కాబట్టి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడమే కాకుండా వాటిని చాలా కాలం పాటు ఉంచుతుంది. తీసుకునే ఆహారంలో కొవ్వులు, ఫ్రైలు, పదార్ధాలు అధికంగా ఉండకుండా చూసుకోవాలి.

Also Read : ఆపిల్ ఐఫోన్ 15 రిలీజ్ తో భారీగా తగ్గిన iPhone 14 ధరలు ,ఊహించని డిస్కౌంట్ తో

4) బిస్కెట్లు
మధుమేహ వ్యాధిగ్రస్తులకు, క్రీమ్ బిస్కెట్లు ఇతర రకాల డెజర్ట్‌ల కంటే ప్రయోజనకరంగా ఉండవు. క్రీమ్ బిస్కెట్లు తిన్న తర్వాత శక్తి ఏర్పడుతుంది కానీ తక్కువ ఫైబర్ కంటెంట్ కారణంగా శక్తి ఎక్కువ కాలం ఉండదు. అప్పుడప్పుడు క్రీమ్ బిస్కెట్లు తీసుకోవడం వల్ల ఎలాంటి హాని జరగదు. కానీ ఈ బిస్కెట్లను ఇతర పానీయాలతో కలిపి వినియోగించడం ప్రమాదకరం.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in