Telugu Mirror : మంచి ఆహారమే ఆరోగ్యానికి మొదట మెట్టు అని మన అందరికి తెలుసు. ఆహారంతో పాటు మీ ఆరోగ్యాన్ని పెంచేందుకు నీటిని తాగడం కూడా ముఖ్యమే. మీరు ఆరోగ్యాంగా మరియు ఫిట్ గా ఉండేందుకు అధిక మోతాదులో నీరు తాగడం మంచిది. హైడ్రేటెడ్‌గా ఉండటం ముఖ్యం దాని కోసం రోజంతా నీరు తాగడం ఉత్తమమైన మార్గాలలో ఒకటిగా చెప్పొచ్చు. ఇటువంటి సందర్భాల్లో సాధారణంగా నిమ్మకాయను ఉపయోగిస్తారు. నిమ్మకాయతో శరీరం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతుంది. దీనితో పాటు, చర్మ రంధ్రాల నుండి వ్యర్ధాలను తొలగించడం ద్వారా శరీరం శుభ్రంగా ఉండడం లో సహాయపడుతుంది. అదనంగా, ఇది శరీరంలోని కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారు. అయితే, ఏదైనా అధికంగా తీసుకుంటే శరీరానికి ఆరోగ్యానికి హానికరం అని మనకి తెలుసు. అయితే మరి రోజూ నిమ్మకాయను వాడడం మంచిదా కదా.
Also Read : విట మిన్ లు కలిగిన ఆహారం , సరైన వ్యాయామం బలమైన రోగనిరోధక వ్యవస్థకు ఆధారం
నిమ్మకాయ ఉపయోగించడానికి కారణం..
నిమ్మకాయ నీరు త్రాగడం వల్ల శరీరాన్ని శుభ్రపరచవచ్చు. ఆరోగ్యకరమైన బరువును తగ్గించడంలో మరియు శరీరం నుండి టాక్సిక్ మెటీరియల్ ని తొలగించి ఆరోగ్యంగా ఉండేందుకు సహారపడుతుంది. అదనంగా, ఇది శరీరంలో నిల్వ చేయబడిన కొవ్వు పరిమాణాన్ని తగ్గిస్తుంది. అయినప్పటికీ, కొంత మందిలో ఫలితాన్ని వెంటనే పొందాలనుకుంటారు. లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే, అధిక మొత్తంలో తాగడం శరీరానికి హానికరం. ఇందులో ఉండే పోషకాల వల్ల శరీరం లాభాలను పొందవచ్చు కానీ మీరు రోజుకు ఒకటి కంటే ఎక్కువ గ్లాసు నిమ్మకాయ నీటిని మాత్రమే పరిమితం చేసుకోవాలి.
నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల కలిగే నష్టాలను ఒకసారి చూద్దాం.
నిమ్మకాయ నీళ్లు ఎక్కువగా తీసుకుంటే. నిమ్మకాయ నీటిని అధికంగా తీసుకోవడం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పగటి పూట నిమ్మకాయ నీరు తాగితే మీ జీర్ణక్రియ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి నిమ్మకాయ నీళ్లు తాగడం పరిమితం చేయాలి. మితంగా వాడితే ఇకపై శారీరక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.
- నిమ్మరసం ఎక్కువగా తాగితే గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంది.
- లెమన్ వాటర్ ఎక్కువగా తీసుకునేవారిలో పెప్టిక్ అల్సర్ (Peptic ulcer) వచ్చే అవకాశం ఉంది.
- నిమ్మకాయ నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్‌కు దారి తీయవచ్చు.
- శరీరంలో ఐరన్ లోపించే అవకాశం ఉంటుంది.
- మీ జీర్ణవ్యవస్థలో సమస్యలు ఉండే అవకాశం ఉంది.
- మీరు నిమ్మకాయ నీటిని ఎక్కువగా తీసుకుంటే మీ ఎముకలు మరింత పెళుసుగా మారుతాయి.