హరివిల్లు లాంటి ఒత్తైన కనుబొమ్మలు (Eye Brows) కావాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకోవడం సహజం. కానీ చాలామందికి కనుబొమ్మలు పలుచగా, సన్నగా ఉంటాయి. కొంతమందికి కనుబొమ్మలు మందంగా ఉంటాయి. మందపాటి కనుబొమ్మలను థ్రెడ్డింగ్ (Threading) చేయడం వల్ల వాటికి చక్కటి రూపం వస్తుంది. తద్వారా ముఖం చాలా అందంగా కనిపిస్తుంది.
కనుబొమ్మలు అందంగా ఉంటే ముఖం (Face) అందం రెట్టింపు అవుతుంది. సన్నగా మరియు పలుచగా ఉన్న కనుబొమ్మల ను థ్రెడ్డింగ్ చేయడం వల్ల పెద్ద తేడా ఏమీ కనిపించదు. చిక్కటి కనుబొమ్మలు కలిగి ఉండి వాటికి థ్రెడ్డింగ్ చేస్తే ముఖం అందం (Beauty) పెరుగుతుంది.
కాబట్టి మందపాటి కనుబొమ్మలు కావాలి అనుకున్న వారికి ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి మందపాటి కనుబొమ్మల ను సొంతం చేసుకోవచ్చు. వీటిని వాడటం వల్ల చెడు ప్రభావం (Side Effects) కూడా ఉండవు.
కనుబొమ్మలు మందంగా పెరగడానికి కొన్ని ఇంటి చిట్కాలను తెలుసుకుందాం :
కనుబొమ్మల ఒత్తుగా పెరగడానికి ఆముదం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆముదం (Castor Oil) రాయడం వలన కనుబొమ్మలు మందంగా, ఒత్తుగా మారతాయి. ఆముదం జిడ్డు ఎక్కువ గా కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని వాడటానికి ఇష్టపడని వారు ఆముదం కు బదులుగా కొబ్బరి నూనె (Coconut Oil) ను కూడా వాడవచ్చు.
కొబ్బరి నూనె కూడా కనుబొమ్మల ను మందంగా చేయడంలో బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు రాత్రిపూట (Night Time) ఆముదం లేదా కొబ్బరి నూనె రాయడం వల్ల కొన్ని రోజుల్లోనే కనుబొమ్మలు మందంగా మారతాయి.
Also Read : Bye Bye Hair Dye : హెయిర్ డై కి టాటా చెప్పండి, సహజ చిట్కాలతో తెల్ల జుట్టును నల్లబరచండి
కొంతమందికి నూనె రాసుకోవడం ఇబ్బంది అయితే దానికి బదులుగా కలబంద (Aloe Vera) గుజ్జు (Pulp) ను వాడవచ్చు. కనుబొమ్మలపై అలోవెరా గుజ్జు తో మృదువుగా మర్దనా (Massage) చేసి అరగంట సేపు అలాగే ఉంచి తర్వాత సాధారణ నీటితో కడగాలి. కలబంద గుజ్జు కూడా కనుబొమ్మలు మందంగా మారడానికి చాలా బాగా పనిచేస్తుంది.
ఆల్సో Read : Face Pack : పాలు, తేనెలతో పాలుగారే ముఖం మీ సొంతం
కనుబొమ్మలను ఒత్తుగా చేయడంలో ఉల్లిపాయ రసం (Onion Juice) కూడా సహాయపడుతుంది. ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసి వడకట్టి రసం తీయాలి. ఈ రసాన్ని కనుబొమ్మల పై అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత కడగాలి. దీనిలో సల్ఫర్ (Sulphur) ఉండటం వలన కనుబొమ్మలు మందంగా పెరగడంలో సహాయపడతాయి.
కాబట్టి ఇటువంటి కొన్ని ఇంటి చిట్కాలను (Home Tips) పాటించి పలుచగా ఉన్న కనుబొమ్మల ను మందంగా మార్చుకోవచ్చు.