ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో చర్మం పొడిబారడం, దురద, ఎర్రటి దద్దుర్లు వంటి చర్మ సమస్యలు రావడం సహజం. అయితే ఇవి ఏదైనా అలర్జీ (Allergy) వల్ల వస్తున్నాయా లేదా కొన్ని రకాల ఆహారపదార్థాలు తినడం వల్ల కొంతమందికి వాటి వల్ల కూడా ఎలర్జీ వస్తుంది. మరియు కొన్ని రకాల వ్యాధులు (Diseases) వల్ల కూడా ఎలర్జీ వస్తుంది. అయితే ప్రతిసారి ఈ సమస్యలను తేలికగా తీసుకోకూడదు.
కొన్ని రకాల చర్మ సమస్యలు అంతర్లీన వ్యాధులకు సంకేతం కావచ్చు. కాబట్టి వీటిని అశ్రద్ధ చేయకూడదు. రక్తప్రసరణ (Blood Circulation) సమస్యల వల్ల కూడా చర్మం పొడి బారడం మరియు దురద (itching) వంటివి వస్తాయి. అయితే కొన్ని సందర్భాలలో ఇవి తీవ్ర సమస్యగా మారే అవకాశం ఉంటుందని వాటిపై శ్రద్ధ తీసుకోవడం అవసరమని వైద్యులు చెబుతున్నారు.
మధుమేహం (diabetes ) వంటి దీర్ఘకాలిక వ్యాధుల సమస్య ఉన్నప్పుడు చర్మ సంబంధ రుగ్మతలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుందని వైద్యులు అంటున్నారు.
మధుమేహం ఉన్న కొందరిలో చర్మ సమస్యలు (Skin problems) వచ్చినప్పుడు అవి తీవ్ర రూపంగా మారే అవకాశం ఉంటుంది. రక్తంలో చక్కెర పరిమాణం తరచుగా నియంత్రణలో ఉండకపోతే అప్పుడు ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం.
డయాబెటిస్ ఉన్నవారికి చర్మం మీద పొక్కులు (Blisters) రావడం సాధారణ విషయం. ఇవి తెల్లగా ఉంటాయి. కాళ్లు, చేతులు, వేళ్లపై బొబ్బలు కనిపించడం ప్రారంభిస్తాయి. కానీ బొబ్బలు చూడడానికి భయానకంగా (Terrifyingly) కనిపిస్తాయి. కానీ ఇవి నొప్పిని కలిగించవు. 2 లేదా 3 వారాల్లోనే తగ్గిపోతాయి. ఇటువంటి బొబ్బలు వచ్చినప్పుడు మధుమేహం ఉందని లేదా రక్తంలో చక్కెర పరిమాణం నియంత్రణలో లేదని సంకేతం (sign) కావచ్చు. కాబట్టి ఇవి వచ్చినప్పుడు శ్రద్ధ (attention) తీసుకోవడం అవసరమని భావిస్తారు.
Also Read : Type – 2 Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే కాలేయం ఆరోగ్యం గా ఉండాలి..కాలేయాన్ని కాపాడండి ఇలా
మధుమేహం ఉన్నవారిలో డిజిటల్ స్కెరోసిస్ (Digital sclerosis) ను కూడా పెంచేలా చేసే అవకాశం ఉంది. దీనివల్ల చర్మం సాధారణం కంటే మందంగా మారుతుంది. టైప్ వన్, టైప్ టు డయాబెటిస్ తో బాధపడే వారికి ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చేతులు వెనుక భాగంలో లేదా వేళ్ళు, కాళ్ళ మీద చర్మం మందం (thickness) గా మారుతుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించాలి. లేకపోతే ఈ వ్యాధి వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది.
Also Read : Diabetes: శరీరం లో ఇన్సులిన్ కొరత వలన డయాబెటిస్ కాకుండా వచ్చే ఇతర వ్యాధులు తీసుకోవలసిన జాగ్రత్తలు.
నెక్రోబయోసిస్ అనగా చనిపోయిన కణాలు (Dead cells) అని అర్థం. చర్మంపై ఎర్రటి మచ్చలు క్రమంగా పెరిగి ప్రకాశవంతంగా మారతాయి. అయితే కొన్ని సందర్భాలలో పసుపు రంగులోకి మారుతాయి. పసుపు రంగులోకి మారినప్పుడు చర్మం పలుచగా మారి మరియు పగుళ్లు (cracks) ఏర్పడతాయి. ఇది గాయాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇటువంటి కేసులు చాలా అరుదుగా ఉన్నప్పటికీ డయాబెటిస్ తో బాధపడుతున్న 300 మందిలో ఒకరికి మాత్రమే ఈ వ్యాధి వస్తుంది.
కాబట్టి డయాబెటిస్ వ్యాధి ఉన్నవారు చర్మ సమస్యలు తరచుగా వస్తుంటే నిర్లక్ష్యం (neglect) చేయకూడదని వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.