Telugu Mirror :ఈరోజుల్లో బిజీ లైఫ్ కారణంగా ఆహారాన్ని సరైన సమయం లో తీసుకోకపోవడం మరియు ఆరోగ్యకరమైన ఆహరంపై శ్రద్ధ చూపకపోవడం వల్ల శరీరంలో అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. స్ట్రీట్ ఫుడ్ మరియు జంక్ ఫుడ్ అధికంగా తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని మన అందరికీ తెలుసు. దీని వల్ల కొలెస్ట్రాల్ (Cholesterol) స్థాయిలు పెరుగుతాయని మీకు తెలుసా?
రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు అధిక కొలెస్ట్రాల్‌ను సూచించడమే కాకుండా రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. ఈకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు. కొలెస్ట్రాల్ పెరిగితే హార్ట్ ఎటాక్ (Heart attack) , బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) లాంటి జబ్బులు అధికంగా వస్తాయి. కొలెస్ట్రాల్ సమస్య అధిగమించకుండా ఉండేందుకు కూరగాయలను మీ ఆహరంలో చేర్చుకోండి. సహజంగా బెండకాయ తినడం వల్ల తెలివి తేటలు పెరుగుతాయి మరియు బ్రెయిన్ కి చాలా మంచిది అని అంటూ ఉంటారు. బెండకాయను ఆహారంగా తీసుకుంటే కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవచ్చు అనే విషయాన్ని పిఎస్ఆర్ఐలో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ హెడ్ మనోజ్ గుప్తా గారు సమాచారాన్ని అందిస్తున్నారు.
Also Read : Diabetes : మధుమేహం ఉన్నవారు చర్మ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందో తెలుసా?
బెండకాయని జీరో కొలెస్ట్రాల్ కూరగాయగా చెబుతారు. మెదడు కణజాలం మరియు నరాల కణజాలాన్నిఆరోగ్యంగా ఉంచడానికి బెండకాయలో ఉండే రసాయనాలు ఎక్కువగా ఉపయోగపడతాయి. లేడీ ఫింగర్ సీడ్స్‌లో కొలెస్ట్రాల్‌ను తగ్గించే పాలీశాకరైడ్లను కలిగి ఉన్నాయని NCBI నివేదికలు పేర్కొన్నాయి. బెండకాయలో న్యూక్లీస్ అని చెప్పబడే ఒక రసాయనం ఉంటుంది. లేడీస్ ఫింగర్‌ను కట్ చేసినప్పుడు దాని నుండి జిగటగా ఉండే జెల్ లాంటి పదార్ధం కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉండేందుకు కీలకమని నిపుణులు పేర్కొన్నారు.
బెండకాయలో ఉండే రసాయనాలు మన శరీరంలో ఉండే హానికరమైన కొలెస్ట్రాల్‌ను మలం ద్వారా తొలగిస్తుంది. ఇందులో పీచు పదార్ధం కూడా పుష్కలంగా ఉండడం వల్ల తిన్న ఆహారములో చెక్కరను నెమ్మదిగా రక్తంలో కలిసేలా చేసి చక్కెర (Sugar) స్థాయిలను అదుపులో ఉంచుతుంది. దీని కారణం చేత కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడడమే కాకుండా మెదడుకు చురుకుదనాన్ని కూడా ఇస్తుంది.
అయితే బెండకాయలను సరైన విధంగా వండుకుంటేనే అన్ని పోషకాలు శరీరానికి అందుతాయి. బెండకాయలు వండుకునే సమయంలో తక్కువ నూనెను ఉపయోగించడం మంచిది. ఎక్కువ నూనెను వాడడం వల్ల ప్రయోజనాన్ని పొందడానికి బదులుగా హాని కలుగుతుంది. కాబ్బటి డీప్- ఫ్రై (Deep-fry) చేసిన బెండకాయను తినడం వల్ల ఆరోగ్యం పై చేడు ప్రభావం చూపుతుంది.
Also Read : Poultry : భారత్ లో చికెన్, కోడిగుడ్డు ధరలు పెరగడానికి శ్రీ లంక కారణమా?
కాబట్టి సరైన రీతిలో బెండకాయని ఆహారంగా తీసుకుంటే మలబద్దకాన్ని కూడా నియంత్రించొచ్చు అని పరిశోధకులు చెప్తున్నారు.