ప్రభుత్వం నిర్వహించే చిన్న మొత్తం పొదుపు పథకాలలో (Small Savings Scheme) మీరు పెట్టుబడి పెట్టి ఉన్నట్లు అయితే, ఈ వార్త వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇటీవల ఆర్ధిక మంత్రిత్వ శాఖ PPF, సుకన్య సమృద్ధి పథకం, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS), నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (NSC) నిబంధనలను మార్చింది. మారిన నిబంధనలకు అనుగుణంగా ఆర్థిక శాఖ (Department of Finance) ఇప్పటికే అలర్ట్ గా ఉన్నది. పైన పేర్కొన్న పథకాలన్నింటిలో పెట్టుబడులకు ఆధార్, పాన్ తప్పని సరి అని ప్రభుత్వం గతంలోనే తెలియజేసింది.
పెట్టుబడిదారులకు సెప్టెంబర్ 30 వరకు గడువు
ఈ పధకాల కోసం ఆర్ధిక శాఖ పెట్టుబడిదారులకు సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది. పెట్టుబడి దారులు ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరికను పట్టించుకోకుండా ఉంటే అక్టోబర్ 1 నుంచి మీ ఖాతా (Account) పనిచేయదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్లో, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై), పోస్టాఫీస్ స్కీమ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ మొదలగు స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ల కోసం, పెట్టుబడిదారులు KYC చేయడం కోసం పాన్, ఆధార్ (PAN, Aadhaar) ను ఇవ్వవలసి ఉంటుంది. కొత్త నిభంధన ప్రకారం ఇది అవసరం. గతంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆధార్ లేకుండా కూడా పెట్టుబడులు పెట్టవచ్చు.
Also Read : పాన్‌కార్డు పోగొట్టుకుంటే ఏం చేయాలి, ఇ పాన్‌కార్డ్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి
సుకన్య సమృద్ధి యోజన పధకం 2015లో ప్రారంభ మయింది. ఒకవేళ మీరు ఇంకా ఆధార్‌ను పొందకపోతే, మీరు ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ ద్వారా కూడా పధకాలలో పెట్టుబడి (Investment) పెట్టవచ్చు. చెప్పిన పరిమితికి మించి పెట్టిన పెట్టుబడులపై పాన్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. మోదీ ప్రభుత్వం 2015లో సుకన్య సమృద్ధి యోజనను ప్రారంభించింది. ఇంతకు ముందు ఆధార్ లేకుండానే ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ నిబంధనను (the clause) మార్చింది. సుకన్య సమృద్ధి లాంటి పథకంలో ఖాతా ప్రారంభించే ముందు పాన్ కార్డ్ లేదా ఫారం 60 సమర్పించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఖాతా తెరిచే సమయంలో మీరు పాన్‌ను ఇవ్వలేక పోతే, రెండు నెలల లోగా మీరు పాన్ కార్డ్ ని సమర్పించవచ్చు.
Also Read : Sukanya Samrudhi : కేవలం 250 రూపాయలతో డిపాజిట్, మీ చిన్నారి భవిష్యత్ కోసం అదిరిపోయే స్కీమ్
ఏయే పథకాలకు ఈ నిబంధన వర్తిస్తుంది?
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (POMI)
పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ (FD)
పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD)S)
సుకన్య సమృద్ధి యోజన (SSY)
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD)
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్లు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ( PPF)
సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ (SCSS)
కిసాన్ వికాస్ పత్ర (KVP)