వెజ్ ఆర్డర్‌లో నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ చేసినందుకు జొమాటో, మెక్‌ డొనాల్డ్స్ లకు లక్ష రూపాయల జరిమానా, ఎందుకో తెలుసా

Telugu Mirror : ఆన్‌ లైన్‌ (Online) ఫుడ్ డెలివరీ ద్వారా జొమాటో (Zomato) ఇంటి వద్దకే ఆహారాన్ని తీసుకొస్తూ మన జీవితంలో ఒక భాగమైపోయింది. అయితే కొన్ని విషయాల్లో కస్టమర్స్ ఆగ్రహానికి గురవుతోంది. కాగా మరికొందరు వినియోగదారులు అయితే కోర్టుకెక్కిన సందర్భాలూ కూడా చాలా ఉన్నాయి. తాజాగా ఇటువంటి సంఘటనే ఒకటి జరిగింది.

Also Read :మెగా పోరుకు సిద్దమైన అహ్మదాబాద్‌ క్రికెట్‌ స్టేడియం, రేపే ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో (Zomato) ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చైన్ మెక్‌ డొనాల్డ్స్ (McDonald’s) లకు జోధ్ పూర్ లోని వినియోగదారుల కోర్టు భారీ జరిమానా విధించింది. తమకు లక్ష రూపాయల జరిమానా విధించినట్లు జొమాటో (Zomato) స్వయంగా శుక్రవారం వెల్లడించింది. జోధ్‌పూర్‌ లోని వినియోగదారుల కోర్టు జొమాటో మరియు మెక్‌ డొనాల్డ్స్ లకు  లక్ష రూపాయల జరిమానా విధించింది. వినియోగదారుల రక్షణ చట్టం 2019ని ఉల్లంఘించినందుకు రెండు కంపెనీలకు ఈ జరిమానా విధించబడింది. ఇది కాకుండా వారు రూ. 5000 లీగల్ ప్రొసీడింగ్స్ ఫీజు ను కూడా చెల్లించాల్సి ఉంటుంది.

zomato-was-fined-rs-1-lakh-for-delivering-non-veg-food-instead-of-veg

అసలు విషయం ఏమిటంటే  ఒక కస్టమర్ Zomato నుండి ఆహారాన్ని ఆర్డర్ (Order) చేశాడు. కస్టమర్ (Customer) వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ చేశాడు మెక్‌ డొనాల్డ్స్ పొరపాటున కస్టమర్ కు వెజ్‌ కి బదులుగా నాన్-వెజ్ ఫుడ్‌ను పంపారు. ఈ విషయమై కస్టమర్ కోర్టులో ఫిర్యాదు చేశారు జోధ్‌పూర్‌లోని జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార ఫోరం(2) కేసును విచారిస్తున్నప్పుడు, కంపెనీలు వినియోగదారుల రక్షణ చట్టం 2019ని ఉల్లంఘించినట్లు గుర్తించింది. దీంతో కోర్టు వారిద్దరికీ లక్ష రూపాయల జరిమానా విధించింది. చట్టపరమైన చర్యలకు అయ్యే ఖర్చులను కంపెనీలే భరించాలని వినియోగదారుల కోర్టు కూడా తెలిపింది. ఇందుకోసం రెండు కంపెనీలు రూ.5000 చెల్లించాలని కోరింది. ఈ విధంగా ఖర్చులు, జరిమానా మొత్తం కలుపుకుని రెండు కంపెనీలు రూ.1లక్ష 5వేలు చెల్లించాల్సి వచ్చింది.

Also Read : కూరలలో ఉప్పు ఎక్కువ అయితే సింపుల్ గా ఇలా చేయండి, ఉప్పు తగ్గుతుంది, టేస్ట్ పెరుగుతుంది

ఇద్దరూ సమానంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అంటే ఇద్దరూ రూ.52,500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే వినియోగదారుల కోర్టు ఆదేశాలపై అప్పీల్ చేస్తామని Zomato చెబుతోంది. అప్పీల్‌ను దాఖలు చేసే ప్రక్రియలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇందుకోసం కంపెనీ తన న్యాయ సలహాదారుల నుంచి సలహాలు తీసుకుంటోంది. ఈ ఆర్డర్ విషయంలో తమ తప్పేమీ లేదని జోమాటో వాదిస్తోంది. జొమాటో అనేది కేవలం ఫుడ్‌ని అందిస్తుందని రెస్టారెంట్ ఇందుకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. సేవా లోపం, ఆర్డర్‌ లో వ్యత్యాసాలకు మాత్రమే తాము బాధ్యుల మని జొమాటో స్పష్టం చేసింది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in