రోహిత్ శర్మ మరియు శ్రేయాస్ అయ్యర్ సునామి ఇన్నింగ్స్ , పాకిస్తాన్ ను చిత్తు చేసిన భారత్

India wins against Pakistan in World Cup match

Telugu Mirror : భారత్ మరియు పాకిస్థాన్ మధ్య ఈ రోజు  జరిగిన మ్యాచ్ లో భారత్ విజయాన్ని సొంతం చేసుకుంది. అందరూ ఆతృతగా ఎదురు చూసిన ఈ ప్రపంచకప్‌లో చాలా ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను ఓడించి భారత ప్రజల్లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. టాస్‌ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్ ని  ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న పాక్ మంచి ప్రారంభాన్ని పొందింది, కానీ భారత్ త్వరగా ట్రాక్‌లోకి వచ్చి పాకిస్తాన్‌ను 191 పరుగులకు ఆలౌట్ (All out) చేశారు. భారత్ 192 పరుగులు చేసి పాక్ జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించారు.

Also Read : తీరొక్క పువ్వులతో బతుకమ్మ, నేటి నుంచే తెలంగాణలో బతుకమ్మ వేడుకలు

రోహిత్ శర్మ పాక్ బౌలర్లకు (Bowlers) చుక్కలు చూపించాడు. ప్రతి ఓవర్ (Over) కి రెండేసి చొప్పున  బౌండరీస్ కొడుతూ పాకిస్థాన్ ని ఓటమికి దగ్గర చేసాడు. రోహిత్ శర్మ (86) మరియు శ్రేయాస్ అయ్యర్(53) పరుగులు తీసి భారత్ విజయానికి మూల కారణం అయ్యారు. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత పాయింట్ల పట్టికలలో భారత్ 6 పాయింట్స్ మరియు 1.821 రేటింగ్స్ తో  టాప్ పొజీషన్ లోకి దూసికెళ్ళింది. ఇక పాకిస్థాన్  42.5 ఓవర్ల వద్ద తమ ఇన్నింగ్స్ (Innings) ని ముగించారు. భారత్ బౌలర్లు తల రెండు వికెట్లు తమ ఖాతాల్లో వేసుకున్నారు.

 India wins against Pakistan in World Cup match
Image Credit : Outlook India

ఊహించినట్లు గానే అభిమానులు ఈ మ్యాచ్ ఫలితంతో థ్రిల్ (Thrill) అయ్యారు మరియు చాలా మంది సోషల్ మీడియాలో (Social Media) సంబరాలు చేసుకుంటున్నారు. 2023 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన తర్వాత భారతీయులు ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నారనేది నెటిజన్ల ప్రతిస్పందనల ద్వారా బాగా తెలుస్తుంది. ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. 1992లో పాకిస్థాన్‌పై భారత్ 43 పరుగుల తేడాతో విజయం సాధించి వారి ప్రస్థానాన్ని ప్రారంభించింది. ప్రపంచ కప్ లో భారత్ పాకిస్థాన్ పై గెలవడం ఇది ఎనిమిదోసారి. 1996, 1999, 2003, 2011, 2015 మరియు 2019లో, మెన్ ఇన్ బ్లూ (Men in Blue) అద్భుత విజయాలను సాధించింది.

అక్టోబర్ 19న బంగ్లాదేశ్‌తో తలపడనున్న భారత్ 

పూణే లోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో అక్టోబర్ 19న భారత్‌ బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడనున్నారు. పాకిస్థాన్ ఈ మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియా తో తలపడనుంది. చెన్నైలోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఈ ఆట జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈరోజు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం మనకి తెలిసిందే.

Also Read : బ్యాంకులకు షాక్ ఇచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రూల్స్ అతిక్రమణలో భారీగా జరిమానా

2023 ప్రపంచ కప్ , అక్టోబర్ 5న డిఫెండింగ్ విజేత ఇంగ్లాండ్ మరియు రన్నరప్  అయినా న్యూజిలాండ్ మధ్య ఆటతో ప్రారంభమైంది. ప్రపంచ కప్ లో  మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. చివరి మ్యాచ్ నవంబర్ 19న జరగనుంది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in