OnePlus Nord CE 3 Lite 5G vs OnePlus 11R 5G

Telugu Mirror  : OnePlus 11R 5G మరియు OnePlus Nord 3 5G ఈ రెండు ఫోన్ ల మధ్య తేడాలను చూద్దాం. OnePlus 11R 5G మన దేశంలో ఫిబ్రవరిలో విడుదల అయ్యింది. అలానే OnePlus Nord 3 జూలై 5 న విడుదల అయింది. కానీ ఈ ఫోన్ యొక్క అమ్మకాలు ఇంకా మొదలు కాలేదు. OnePlus 11R 5G రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉంది, 8GB + 128GB మరియు 16GB + 256GB మోడల్స్ ఉన్నాయి.

కానీ OnePlus Nord 3 కూడా 8GB + 128GB మరియు 16GB + 256GB వేరియంట్ లలో విడుదల అయ్యింది. OnePlus Nord 3 యొక్క ధర OnePlus 11R తో పోలిస్తే OnePlus Nord 3 మనకు తక్కువ ధరకే లభిస్తుంది. OnePlus 11R 8GB RAM మరియు 128GB స్టోరేజ్ యొక్క ధర రూ.39,999 కు లభిస్తుంది. 16GB మరియు 256GB యొక్క ధర రూ.44,999.

Tecno Camon 20 Premier 5G | టెక్నో నుంచి మరో బడ్జెట్ ఫోన్..ఇవీ ఫీచర్లు..!

కానీ OnePlus Nord 3 యొక్క 8GB మరియు 128GB ఇన్ బిల్ట్ స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.33,999 బేస్ ధర తో OnePlus విడుదల చేసింది. మరియు 16GB RAM మరియు 256GB ఆన్ బోర్డ్ స్టోరేజ్ యొక్క ధర రూ.37,999. OnePlus 11R సోనిక్ బ్లాక్ మరియు గలాటిక్ సిల్వర్ ఇలా రెండు కలర్ ఆప్షన్ లలో అందుబాటులో ఉంది. కానీ OnePlus Nord 3 మాత్రం మిస్టి గ్రీన్ మరియు టెంప్ సెట్ గ్రే కలర్ లలో ఈ ఫోన్ విడుదల అయ్యింది.

OnePlus 11R మరియు OnePlus Nord 3 రెండు కూడా 6.74-inch డిస్ ప్లే తో లభిస్తున్నాయి. OnePlus 11R AMOLED డిస్ ప్లే తో వస్తే, OnePlus Nord 3 సూపర్ ఫ్లూయిడ్ డిస్ ప్లే తో వచ్చింది. ఈ రెండు హ్యాండ్ సెట్ లు 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉన్నాయి.
OnePlus Nord 3 ఆండ్రాయిడ్ 13 మరియు Oxygen OS 13 తో నడుస్తుంది. OnePlus 11R మాత్రం Oxygen OS 12.1 ను కలిగి ఉంది, కానీ OnePlus 11R కు సాప్ట్ వేర్ అప్ డేట్ ల ద్వారా Oxygen OS 13 ను పొందుతుంది. OnePlus 11R Qualcomm Snapdragon 8+ Gen 1 5G SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. కానీ OnePlus Nord 3 MediaTek Dimensity 9000 చిప్ సెట్ తో లభిస్తుంది.

Samsung Galaxy M34 5G: వచ్చేసింది…6,000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా

OnePlus Nord 3 లో Game-tastic Gaming అనే ఫీచర్ ను కలిగి ఉంది. దీని వల్ల గేమ్ లన్ని స్మూత్ గా నడుస్తాయి, OnePlus Nord 3 1000Hz టచ్ రెస్పాన్స్ ను కలిగి ఉంది అలానే OnePlus Nord 3 మల్టీ టాస్క్ ను బాగా చెయ్యగలదు, ఒకే సారి 44 యాప్ లను రన్ చేయగలదని OnePlus చెప్పింది. OnePlus 11R మరియు OnePlus Nord 3 రెండు కూడా మూడు రియర్ కెమెరాలతో వచ్చాయి. Sony IMX890 సెన్సార్ కలిగిన 50- మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా మరియు 8- మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2- మెగా పిక్సెల్ మాక్రో కెమెరాను ఈ రెండు ఫోన్ లు కలిగి ఉన్నాయి. OnePlus Nord 3 112 డిగ్రీల వైడ్ యాంగిల్ ఫోటోలను తీస్తుంది. రెండు హ్యాండ్ సెట్ లు 16- మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉన్నాయి.

OnePlus 11R 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. అలానే 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. OnePlus Nord 3 కూడా 5000mAh బ్యాటరీతో వస్తుంది కానీ ఇది మాత్రం 80W superVOOC ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. OnePlus 11R తో పోలిస్తే తక్కువ ధర, అప్ డేటెడ్ కెమెరా ఫీచర్స్ ,అప్ డేటెడ్ వెర్షన్, మంచి పర్ఫామెన్స్ మరియు ఇస్తుంది కాబట్టి OnePlus Nord 3 5G ను తీసుకోవడం మంచి నిర్ణయం.

Leave A Reply

Your email address will not be published.