Telugu Mirror : బెంగళూరు కి చెందిన ట్రెసా మోటార్స్ కంపెనీ నుంచి మొట్టమొదటి EV మోడల్ VO.1 ట్రక్ ని ప్రపంచ మార్కెట్ కి పరిచయం చేసింది. ట్రెసా విడుదల చేసిన ఎలక్ట్రిక్ వాణిజ్య వెహికల్ గుడ్ లుకింగ్ తో అద్భుతంగా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలో భారీ వాణిజ్య వాహనాల పరిధిని పెంచేందుకు ట్రెసా సిద్దంగా ఉందని కంపెనీ తెలిపింది.గత కాలపు ఆవిష్కరణలను దాటి ఇప్పుడు ప్రతి రంగం లోనూ నూతన టెక్నాలజి ద్వారా కొత్త తరం ఎన్నో రకాల మార్పులను చేస్తోంది ఇదే వరవడిలో నూతన సాంకేతికతను ఉపయోగించి ఆటోమొబైల్ రంగం లో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్ రంగం లో ఎలక్ట్రిక్ వాహనాల హవా నెమ్మదిగా మొదలై ముందుకు సాగుతుంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల నుండి SUV కార్ లకే పరిమితం కాకుండా వాణిజ్య ట్రక్కులను ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనే ఆలోచనతో బెంగళూరు కు చెందిన ట్రెసా తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనం VO.1మోడల్ ని ఆవిష్కరించింది. ప్రస్తుత మార్కెట్ లో నడుస్తున్న డీజిల్ ట్రక్కుల కంటే తక్కువ ఖర్చు తోపాటు సురక్షిత మైన పర్యావరణాన్ని కలిగించాలనే ప్రయత్నం లో భాగంగా, ట్రెసా మోటార్స్ నుంచి ఎలక్ట్రిక్ ట్రక్కుని ప్రపంచ మార్కెట్ కి పరిచయం చేసింది.
OnePlus Nord CE 3 Lite 5G vs OnePlus 11R 5G
ట్రెసా మోటార్స్ నుండి వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ ట్రక్ మోడల్,VO.1ని యాక్సియల్ ఫ్లక్స్ మోటార్ ఫ్లాట్ఫారమ్ పై తయారుచేయబడింది. ఫ్లక్స్ 350. ట్రక్ ప్రపంచ మార్కెట్ కోసం నిర్మించబడింది. ట్రెసా మోటార్స్ తన పారిశ్రామిక రూపకల్పన,యాక్సియల్ ఫ్లక్స్ పవర్ ట్రైయిన్ లు అలాగే దాని యొక్క అన్ వీలింగ్ మధ్యస్థ మరియు హెవీ ఎలక్ట్రిక్ ట్రక్కుల కోసం సురక్షితమైన బ్యాటరీ ప్యాక్ లను ప్రదర్శిస్తుందని కంపెనీ తెలిపింది.
ట్రెసా సైబర్ ట్రక్ నుండి పొందిన ప్రేరణతో వచ్చిన డిజైన్ అని ఈ ఎలక్ట్రిక్ ట్రక్ ప్రస్తుతం భారత దేశంలో లభిస్తున్న వాటివాటికి భిన్నంగా ఉంది.మాట్ బ్లాక్ పెయింట్ స్కీమ్,స్లిమ్ ORVMలు మరియు నిలువుగా ఏర్పాటు చేసిన పెద్ద LED హెడ్ ల్యాంప్ లతో ఆకట్టుకుంటుంది ట్రెసా మోటార్స్ యొక్క VO.1 డిజైన్.
Tecno Camon 20 Premier 5G | టెక్నో నుంచి మరో బడ్జెట్ ఫోన్..ఇవీ ఫీచర్లు..!
ట్రెసా మోటార్స్ వారి లెక్కల ప్రకారం,భారత దేశం 2.8 మిలియన్ల ట్రక్కులను కలిగి ఉంది.వీటిద్వారా 60శాతం కాలుష్య కారకమైన ఉద్గారాలకు దోహాదపడుతుంది.ట్రెసా సున్నా పర్సెంట్ ఉద్ఘారాల మరియు భారీ ట్రక్కుల యొక్క అవసరాన్ని అధికం చేస్తుంది.
ట్రెసా మోటార్స్ వ్యవస్థాపక CEO రోహన్ శ్రవణ్ మాట్లాడుతూ రాబోయే కాలంలో భారత దేశం ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రపంచ పవర్ హౌస్ గా మారుతుందని.ట్రెసా మోటార్స్ తో ఆ ఆలోచనను నిజం చేసేందుకు మరియు ప్రపంచ రవాణా పరిష్కారాలలో భారత దేశాన్ని అగ్ర భాగాన నిలిపేందుకు మేము ధృడ నిశ్చయంతో ఉన్నామని అన్నారు.FY 2023 రెండవ త్రైమాసికంలో ట్రెసా VO.1మోడల్ ఎలక్ట్రిక్ ట్రక్ ని విడుదల చేయనున్నట్లు ట్రెసా మోటార్స్ తెలిపింది.