Telugu Mirror : మెర్సిడెస్ బెంజ్ 2024 CLE కార్ ను రివీల్ చేసింది, ఈ సంవత్సరం సెప్టెంబర్ లో ఈ కార్ ను యూరోప్ మార్కెట్ లోకి తీసుకొస్తుంది. 2024 CLE ఒక కూపే మోడల్, అంటే ఇందులో కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించగలరు. ఇప్పటి వరకు ఉన్న కార్ లలో 2024 CLE పెద్ద కూపే కార్. ఈ కార్ 4,850mm పొడవు, 1,860mm పొడవు వెడల్పు మరియు 1,428mm ఎత్తును కలిగి ఉంటుంది. CLE 2024 ఇంతకు ముందు విడుదల అయిన C class కూపే మరియు E class కూపే యొక్క అప్ డేటెడ్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు.
Tresa Motors : ప్రపంచ మార్కెట్ కి ట్రెసా విO.1 ట్రక్..
C class కూపే కార్ తో పోలిస్తే మెర్సిడెస్ బెంజ్ 2024 CLE 20mm పెద్ద టైర్ లను కలిగి ఉంది. అలానే 2024 CLE పెద్ద కూపే కాబట్టి ప్రయాణికులు 10mm హెడ్ రూమ్, 19mm షోల్డర్ రూమ్ మరియు 19mm ఎల్బో రూమ్ లను అదనంగా పొందవచ్చు. ఎక్కువ స్పేస్ దొరకడం వల్ల కూర్చున్న వారికి ఇరుగ్గా లేకుండా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అలానే మెర్సిడెస్ బెంజ్ 2024 CLE ఒక 12.3 – అంగుళాల డిజిటల్ డిస్ ప్లే ను కలిగి ఉంటుంది. దీంతోపాటు మరో 11.9 – అంగుళాల టచ్ స్క్రీన్ డ్రైవర్ కు ఎదురుగా ఉంటుంది. అలానే ఈ కార్ MBUX సిస్టమ్ యొక్క లేటెస్ట్ వెర్షన్ ను కలిగి ఉంది.
ఇలా ఉండటం వల్ల కార్ వినియోగ దారుడు సులభంగా కార్ ను ఆపరేట్ చేయడమే కాకుండా ఇంకా ఎన్నో మల్టీ మీడియా పనులు చెయ్యవచ్చు. మెర్సిడెస్ బెంజ్ 2024 CLE మూడు వేరియంట్ లలో విడుదల కానుంది. 2024 CLE 200d డీజిల్ వెర్షన్ 2 లీటర్ ల డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఈ 2 లీటర్ డీజిల్ ఇంజిన్ 197 hp ను అంధిస్తుంది మరియు 470 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలానే పెట్రోల్ వేరియంట్ CLE 200 మోడల్ కూడా అందుబాటులోకి రానుంది, ఇది 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది, ఈ ఇంజిన్ 204 hp నూ విడుదల చేస్తుంది మరియు 320 Nm టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ రెండు వేరియంట్ లు వెనుక టైర్ లకు మాత్రమే శక్తిని ఇస్తాయి.
Tecno Camon 20 Premier 5G | టెక్నో నుంచి మరో బడ్జెట్ ఫోన్..ఇవీ ఫీచర్లు..!
నాలుగు టైర్ లను వాడే మోడల్ ని కూడా మెర్సిడెస్ తయారు చేసింది. ఈ మోడల్ అయితే 258 hp ను అంధిస్తుంది మరియు 400 Nm టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ మోడల్ పెట్రోల్ తో నడుస్తుంది. మెర్సిడెస్ బెంజ్ 2024 CLE యొక్క హై ఎండ్ మోడల్ 3 లీటర్ కెపాసిటీ మరియు ఆరు సిలిండర్ ఇంజిన్ లను కలిగి ఉంది. దీంతో పాటు ఈ కార్ 380 hp అందజేస్తుంది, అలానే 500 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ అయితే 4.4 సెకండ్లలో 0 నుంచి 100 వేగానికి చేరుకోగలదు మరియు 250 kmph దీని యొక్క హై స్పీడ్. మన భారత దేశంలో ఎప్పుడు విడుదల అవుతుందో తెలియదు, ఎందుకంటే ఇంకా మెర్సిడెస్ యూరోప్ గురించి తప్ప వేరే దేశాల గురించి తెలుపలేదు. ఈ కొత్త మెర్సిడెస్ బెంజ్ 2024 CLE యూరోప్ లో సెప్టెంబర్ నెలలో అందుబాటులోకి రానుంది.