అందమైన మరియు మెరిసే చర్మం కావాలని ప్రతి ఒక్కరు కోరుకోవడం సహజం. ప్రతి సీజన్ లోనూ చర్మాన్ని సంరక్షించుకోవాలి. చలికాలంలో చలికి, వేసవి కాలంలో వేడికి, వర్షాకాలం (Monsoon) లో తేమ కు చర్మం పాడై పోతుంటుంది.
కాలుష్యంతో కూడిన వాతావరణం మరియు దుమ్ము అధికంగా ఉండడం వలన చర్మం సహజమైన కాంతిని కోల్పోతుంది. సహజసిద్ధంగా (Naturally) చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవాలి అంటే ఇంటి చిట్కాలను పాటించడం వలన చక్కటి నిగారింపు చర్మాన్ని పొందవచ్చు.
ఈ రోజు కథనంలో రోజ్ వాటర్ (Rose water) ఉపయోగించడం వల్ల చర్మంపై ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
రోజ్ వాటర్ లో విటమిన్- C అధికంగా ఉంటుంది. ఇది కొల్లాజన్ ఉత్పత్తి ని పెంచడంలో సహాయపడుతుంది. దీనిని చర్మంపై ఉపయోగిస్తే చర్మానికి సహజ కాంతిని తీసుకువస్తుంది. గులాబీ పూలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన చర్మం ను దెబ్బతినకుండా రక్షిస్తుంది.
చర్మం పొడి బారినప్పుడు (dry) రోజ్ వాటర్ ఉపయోగించడం వలన చాలా బాగా పనిచేస్తుంది. అలాగే చర్మం ను తేమగా కూడా ఉంచుతుంది. ప్రతిరోజు రోజ్ వాటర్ ని ఉపయోగించడం వల్ల చర్మం మెరుస్తూ చాలా అందంగా కనిపిస్తుంది. రోజ్ వాటర్ లో కాటన్ ముంచి ప్రతిరోజు ముఖంపై అప్లై చేయవచ్చు. లేదా స్ప్రే బాటిల్ తో రోజ్ వాటర్ ను ముఖంపై స్ప్రే చేయవచ్చు.
ప్రతిరోజు చర్మంపై రోజు వాటర్ ను అప్లై చేయడం వలన ముఖం పై ఉన్న మచ్చలను మరియు టాన్ ను తగ్గిస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మంపై పేరుకొని ఉన్న మురికి (dirty) ని తొలగించి చర్మాన్ని గులాబీ రంగులోకి మార్చడంలో సహాయపడుతుంది.
వేసవి కాలంలో టాన్ (Tan) సమస్య అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు రోజ్ వాటర్ అప్లై చేయడం వల్ల టాన్ సమస్య నుండి బయటపడవచ్చు. కొంతమందికి చర్మం చాలా జిడ్డు (oily) గా ఉంటుంది.
అటువంటి వారికి మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. వారు ప్రతిరోజు రోజ్ వాటర్ ని వాడటం వల్ల మొటిమలు (pimples) తగ్గిపోతాయి. చర్మంపై ఉన్న అదనపు నూనెను కూడా తగ్గిస్తుంది. రోజ్ వాటర్ లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వలన మొటిమలను నిర్మూలించడంలో చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది.
Also Read : Rose Water : ఇంట్లోనే రోజ్ వాటర్ తయారీ, ముఖం క్లీన్, లుక్ ఎవర్ గ్రీన్ కోసం వీటిని తయారు చేసుకోండి.
Face Pack : పాలు, తేనెలతో పాలుగారే ముఖం మీ సొంతం
చర్మంపై ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. గాయాలను మాన్పుతుంది. రోజ్ వాటర్ లో యాంటీ సెప్టిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి చర్మంపై ఉన్న గాయాల (injuries) ను, కోతలను మాన్పుతుంది. రోజ్ వాటర్ ను చర్మంపై ఉపయోగించడం వల్ల చర్మం మీద ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.
రోజ్ వాటర్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు రోజ్ వాటర్ ను చర్మంపై ఉపయోగించడం వలన చర్మ (skin) సమస్యల నుండి సులువుగా బయటపడవచ్చు. మరియు రోజ్ వాటర్ ను ప్రతిరోజు వాడటం వల్ల ముఖాన్ని గులాబీరంగులోకి మార్చుకోవచ్చు.