Telugu Mirror : ప్రతి ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023లో ఇండియాకి మరియు ఇంగ్లాండ్ కి జరిగిన మ్యాచ్ లో 100 పరుగుల తేడాతో ఇండియా గెలిచి మళ్ళీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆట తర్వాత, డ్రెస్సింగ్ రూమ్‌లోని గొప్ప ఫీల్డర్‌కు టీమ్ ఇండియా ప్రత్యేక వేడుకను జరిపింది. ఈ బంగారు బహుమతిని ఇప్పటికే రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ వంటి వారు గెలుచుకున్నారు.
ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 (ICC Cricket World Cup)లో టీం ఇండియా(Team India) వరుసగా ఆరు విజయాలు సాధించారు. విజయం సాధించిన తర్వాత వికెట్ కీపర్ KL రాహుల్ ఆదివారం రెండుసార్లు అత్యుత్తమ ఫీల్డింగ్ “పతకాన్ని” గెలుచుకున్న మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. KL రాహుల్ మాత్రమే ఈ అవార్డుని రెండు సార్లు అందుకున్నారు. బంగారు మెడల్ ని శ్రేయాస్ అయ్యర్ రాహుల్ మేడలో వేశారు.
రోజుకు రూ.10 కంటే తక్కువ పెట్టుబడిపై నెలవారీ రూ.5,000 పెన్షన్ పొందుతారు, ఎలాగో తెలుసుకోండి
దీనికి సంబంధించిన వీడియోని వీక్షించండి..
LIGHTS OUT in Lucknow 🏟️
This Post-match medal ceremony was LIT(erally) Bigger & Brighter 🔆
Presenting a visual spectacle 🤩#TeamIndia | #INDvENG | #CWC23 | #MenInBlue
WATCH 🎥🔽 – By @28anand
— BCCI (@BCCI) October 30, 2023
ఆట తర్వాత, BCCI మరోసారి KL రాహుల్‌ని “ఉత్తమ ఫీల్డర్” (Best fielder) గా ప్రకటించింది. కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ ఇషాన్ కిషన్ ముగ్గురు ఈ గౌరవానికి పోటీ పడ్డారు. భారత జట్టు మొత్తం లాకర్ రూమ్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఫీల్డింగ్ కోచ్ దిలీప్ టీకే చివరిగా ప్రకటన చేశారు. లక్నోలోని ఎకానా స్టేడియంలో ఫ్లడ్‌లైట్లు అన్ని ఆఫ్ అయ్యాయి. చీకటి గా ఉన్న ప్రదేశానికి రాహుల్ పేరు మరియు జెర్సీ నెంబర్ తో వెలుగుని ఇచ్చారు.
విశాఖ మార్గంలో కొన్ని రైళ్లు రద్దు, మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు
KL రాహుల్ రెండవసారి “ఉత్తమ ఫీల్డర్” టైటిల్‌ను అందుకున్నాడు :
ఈ నెల ప్రారంభంలో అహ్మదాబాద్ (Ahmadabad)లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌ను ఓడించిన తర్వాత, రాహుల్ గతంలో “ఉత్తమ ఫీల్డర్”గా ఎంపికయ్యాడు. భారత వికెట్ కీపర్ బ్యాటింగ్‌లో 58 బంతుల్లో 39 పరుగులు చేశాడు, లక్నోలో 87 పరుగులతో టాప్ స్కోర్ చేసిన అతని కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి నాల్గవ వికెట్‌కి 91 పరుగుల అందించాడు.
లక్నో (Lucknow) లో జరిగిన మ్యాచ్ లో రాహుల్ అద్భుతమైన ఆటను ప్రదర్శించారని , లెగ్ – సైడ్ లో రెండు బౌండరీలు అందుకున్నడని ఫీల్డింగ్ కోచ్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి.
ఈ మ్యాచ్ పై రోహిత్ శర్మ (C) మాటలు :
టీం ఇండియా విజయంపై రోహిత్ శర్మ (Rohith sharma) ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఆడిన ఐదు మ్యాచుల కన్నా ఈ మ్యాచ్ గట్టి పరీక్షను పెట్టింది అని చెప్పారు. మేము బాటింగ్ సరిగ్గా చేయలేదని, బౌలర్లు బాగా ఆడారని తెలిపారు. మేము ఆశించిన స్థాయిలో బాటింగ్ చేయలేకపోయామని అతను చెప్పారు. మా టీం నుండి బౌలింగ్ గట్టిగా ఉంది కాబట్టి ఈ మ్యాచ్ ని గెలిచాం అని చెప్పుకొచ్చారు. ప్రత్యర్థి టీంకి తక్కువ స్కోర్ ని టార్గెట్ గా పెడితే బౌలర్ల పై ఒత్తిడి పడుతుంది అని కెప్టెన్ రోహిత్ చెప్పారు.