Telugu Mirror : ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న అత్యంత ప్రముఖమైన మరియు అధిక-బడ్జెట్ లో తీస్తున్న టాలీవుడ్ చిత్ర నిర్మాణాలలో కల్కి 2898 AD ఒకటి. ఈ సినిమాలో ప్రసిద్ధ నటుడు డార్లింగ్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ఈ సినిమాకి నాగ్-అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన VFX సమ్మిట్ (VFX sammit) 2023లో దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag-Ashwin) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాగ్ -అశ్విన్ కల్కి గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. “మేక్ ఇన్ ఇండియా” (Make in India) ద్వారా ప్రేరేపించబడి, భారతదేశంలో జరిగే అన్ని VFX పనులను పర్యవేక్షించడమే తన అసలు లక్ష్యం అని స్పష్టం చేశారు. కానీ మూవీ కథ మరియు దానిపై పెట్టుకున్న అంచనాల కారణంగా హాలీవుడ్ సంస్థలతో పని చేయాల్సి వచ్చింది అని చెప్పారు.
ఎవరూ ఊహించని క్రాస్ ఓవర్, ఒకే ఫ్రేమ్‌లో సల్మాన్ ఖాన్ మరియు క్రిస్టియానో రొనాల్డో
లక్ష్యం పూర్తిగా చేరుకోనప్పటికీ, నాగ్ అశ్విన్ కల్కి 2898 AD కోసం విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఎక్కువగా భారతదేశంలో పూర్తయిందని వెల్లడించాడు. ఇక గ్రాఫిక్స్, యమినేషన్స్, విఎఫ్ఎక్స్ కి సంబంధించిన వర్క్ కోసం ఇకపై హాలీవుడ్ సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం లేదని అటువంటి సంస్థలు ఇప్పుడు భారతదేశంలోనే ఉన్నాయని చెప్పారు. రాబోయే ప్రొడక్షన్‌కి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ (Visual effects) అన్నీ దేశీయంగానే ఉత్పత్తి అయ్యేలా చూస్తానని చెప్పాడు. నాగ్-అశ్విన్ చెప్పిన మాటలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
2018లో నాగ్-అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి (సావిత్రి జీవిత చరిత్ర) సినిమా తర్వాత సినిమా, స్క్రీన్ ప్లే కోసం చాలా కాలం పాటు పని చేస్తున్నాడు. ఈ కల్కి 2898 AD సినిమా పురాణ సైన్స్ ఫిక్షన్ మూవీ. కల్కి పాత్రలో హీరో ప్రభాస్ నటించగా, హీరోయిన్ గా దీపిక పదుకొనె నటిస్తుంది. ఇందులో కమల్ హాసన్ (Kamal Haasan) విలన్ గా నటిస్తున్నాడు. సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం తెర పైకి రానున్నది. కథకి అనుకూలంగా ఈ సినిమాకి కల్కి 2898 AD అని పెట్టడం జరిగింది.
ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని మరియు ఇతరులతో సహా ప్రముఖ కళాకారులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కి వైజయంతీ మూవీస్ నిర్మాణ సంస్థ బాధ్యత వహిస్తుంది. ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించనున్నారు.