భూమి మీద మానవ జీవనం మొదలై, అనాగరిక స్థితి నుంచి నాగరిక సమాజంగా మార్పు చెందింది.ఈ మార్పు చెందే ప్రక్రియలో మానవుడు ఎన్నో నూతన ఆవిష్కరణలను చేసినాడు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయి. 2G తరువాత 3G ఆనక 4G ఇప్పుడు 5G గా మార్పులు చెంది , ప్రపంచం అంతా మారినా కానీ, సంతానంగా అబ్బాయి కావాలనే విషయంలో భారతీయుల మనస్తత్వాలు మాత్రం ఇంకా మారలేదు అని రీసెర్చ్ లో వెల్లడైంది.
భారత్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అన్ని రంగాలలో దూసుకు పోతున్నారు. దేశ ప్రధమ పౌరుడిగా(First Citizen of India),ఎంతో ప్రతిష్ఠ కలిగిన గణతంత్ర దేశానికి అధ్యక్షురాలిగా మహిళామణి దూసుకు వెళ్తున్నా. సంతానంగా కొడుకు కావాలనే స్వార్థం భారతదేశ ప్రజలలో మాత్రం మారలేదని పరిశోధనా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
Also Read:Farmers Pension Scheme: రైతులకు పింఛన్ పధకం.దరఖాస్తు చేయండి ఇలా
ఇండియన్ పాలసీ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ వెల్లడించిన రీసర్చ్ నివేదిక ప్రకారం.భారత దేశంలోని వృద్దులకు వారి కుమారులు ఆర్థిక రూపేణా ఆదుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని మార్చడానికి,దేశ వ్యాప్తంగా ఉన్న వృద్దులకు పబ్లిక్ పెన్షన్(Public Pension) పధకాన్ని ప్రారంభించవలసిన అవసరాన్ని పరిశోధనా సంస్థ నివేదిక బలంగా చెప్పింది.
సీమా జయచంద్రన్,ప్రిన్స్ టన్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ అండ్ పబ్లిక్ అఫైర్స్ డిపార్టుమెంట్ లో ప్రొఫెసర్ అభిప్రాయం ప్రకారం స్కూల్స్ ద్వారా విద్యార్ధినిలకు కావలసిన ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేలా చూడాలని పేర్కొన్నారు. భారతీయ కుటుంబాలలో అమ్మాయిల కంటే కూడా అబ్బాయిలకు ప్రాధాన్యత ఇచ్చే ఆటిట్యూడ్ ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి పాకింది కానీ ఎక్కడా కనుమరుగు కాలేదు అని ప్రొఫెసర్ జయచంద్రన్ ఉద్ఘాటించారు. అంటే మగ పిల్లల పై పెడుతున్న పెట్టుబడికి వారితో పాటు పుట్టిన ఆడపిల్లల విషయం లో చాలా వివక్ష ఉంటుంది.
సంతానం గా కొడుకు కావాలనే ఆకాంక్ష అలాగే కుటుంబంలో పెద్ద కొడుకు యొక్క ప్రాధాన్యత వలన లింగ వివక్షతలకు మార్గాలుగా మారుతున్నాయని ప్రొఫెసర్ అన్నారు. వంశం పోతున్నటువంటి కుటుంబాలలో, కొడుకు కావాలి,కొడుకుని కనాలి అనేటువంటి ఆకాంక్షను పెంచుతుందని,లింగ ప్రాధాన్యతలో ఇది మరింత ఎక్కువ అవుతుంది అని పేర్కొన్నారు.
ఒక కుటుంబంలో,తల్లిదండ్రులు కుమారుడు కావాలని అనుకుంటే అది వాళ్ళ ఆడపిల్లల మానసిక ఎదుగుదల,ఆరోగ్యం పైన ప్రత్యక్షంగా అలానే పరోక్షంగా ప్రభావం చూపెడుతుంది. మొదట ఆడపిల్ల పుట్టిన తరువాత తల్లి వెంటనే రెండవ బిడ్డ కోసం గర్భంతో ఉన్నప్పుడు నుండి తల్లి పాలు ఇవ్వడం ఆపినప్పటి వరకు అనేక రూపాలు ఉన్నాయి.
అదేవిధంగా ప్రభుత్వ విధానాలను మార్చడం,కుటుంబాలలో కొడుకుల మీద ఉన్న ఆసక్తిని తగ్గించడం పెను సవాల్ అని ప్రొఫెసర్ సీమా జయ చంద్రన్(sima jayachandhran)తన పరిశోధనా నివేదికలలో పేర్కొన్నారు.
Also Read:Women Loan Scheme : మహిళల కోసం అద్భుత రుణ పథకం..దళిత మహిళ లకు వడ్డీ లేకుండా రుణం
వృధ్యాప్యంలో కుమారుడే తల్లిదండ్రులను కాపాడుతాడు అనే బలమైన ఆలోచన,కుటుంబ వారసత్వం,తరం,కుమార్తె ఇంట్లో తల్లిదండ్రులకు సరైన గౌరవం ఉండదు అనే భావన ఇప్పుడిప్పుడే మెల్లగా మారుతునప్పటికీ,అనాదిగా వస్తున్న సాధారణ ఆలోచన మూలంగా భారతీయులు కొడుకు పై చాలా ఆసక్తి చూపుతారు.కూతురు పెళ్ళి చేసుకుని భర్త ఇంటికి వెళుతుందని,చివరకు కొడుకు మాత్రమే కాపాడతాడు అనే భావనే భారతీయులలో మగ బిడ్డను కనాలి అనే కోరిక కలిగి ఉండటానికి సామాజిక నిర్మాణమే ప్రధాన కారణం.
మగ పిల్లవాడి తల్లిదండ్రులకు, ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులకు ప్రత్యేక అధికారాలను కలిగి ఉండేలా విధానాలను మార్చడం,వృద్దులకు పెన్షన్ అలాగే ఉచిత వైద్యం మొదలగునవి ప్రజల యొక్క మనస్సులలో ఆడ,మగ తేడాలేని లింగ సమానత్వాన్ని తీసుకురావడానికి ఖచ్చితంగా దోహద పడతాయని నమ్ముతున్నారు.