మార్కెట్ లోకి Nothing Phone (2) : ఫోన్ స్మార్ట్..ఫీచర్స్ ఇంకా స్మార్ట్..ఇండియా లో ఒక్క మార్ట్ లో మాత్రమే లభిస్తుంది..

Telugu Mirror: అందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న Nothing Phone (2) భారత్ లో విడుదల అయ్యింది. ప్రస్తుతానికి Nothing Phone (2) యొక్క అమ్మకాలు ఇంకా మొదలు కాలేదు. Nothing Phone (2) జూలై 21 నుంచి ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇవాల్టి నుంచి అంటే జూలై 12 నుంచి ప్రి ఆర్డర్ సేల్స్ మొదలయ్యాయి. ప్రి ఆర్డర్ లో కొనుగోలు చేసే వారికి Axis బ్యాంక్ మరియు HDFC బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ లపై రూ.3000 డిస్కౌంట్ లభిస్తుంది. అలానే ఈ సమయంలో Nothing ఆక్సెసరీస్ పై డిస్కౌంట్ లు బాగానే లభిస్తున్నాయి. జూలై 13 న లండన్ మరియు న్యూ యార్క్ లలో ఉన్న Nothing Drops పాప్ అప్ స్టోర్ లలో Nothing Phone (2) మరియు Nothing కు సంబందించిన ఆక్సెసరీస్ కొనడానికి అందుబాటులో ఉంటాయి. మన భారత్ లో ఉన్న ఒకే ఒక Nothing Drops pop up స్టోర్ బెంగుళూరులో ఉంది. బెంగుళూరులోని లులు మాల్ లో Nothing Drops pop up స్టోర్ ఉంది, జూలై 14 రాత్రి 7 గంటల నుండి ఈ స్టోర్ లో Nothing Phone (2) కొనడానికి అందుబాటులో ఉంటుంది.

Nothing Phone (2) మొత్తం మూడు స్టోరేజ్ ఆప్షన్ లలో విడుదల అయ్యింది. బేస్ వేరియంట్ అయిన 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.44,999. 12GB + 256GB మోడల్ యొక్క ధర రూ.49,999 మరియు 12GB RAM + 512GB ఇన్ బిల్ట్ స్టోరేజ్ మోడల్ ధర రూ.54,999 , జూలై 21 నుంచి ఈ హ్యాండ్ సెట్ ఫ్లిప్ కార్ట్ లో అమ్మకానికి సిద్ధంగా ఉంటుంది.

 

Nothing mobile 2 released available in india only in one store

Nothing Phone (2) వైట్ మరియు కలర్ డార్క్ గ్రే ఆప్షన్ లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7-inch full HD+ LTPO OLED డిస్ ప్లే తో వస్తుంది మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది.

Nothing Phone (2) డ్యుయల్ కెమెరా సెట్ అప్ తో వస్తుంది. 50MP + 50MP కెమెరా లెన్స్ తో వస్తుంది. ఈ హ్యాండ్ సెట్ Sony IMX890 సెన్సార్ తో కలిగిన 50- మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా మరియు 50- మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మరియు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కలిగిన Samsung JN1 సెన్సార్ తో వస్తుంది. అలాగే 32- మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.

Nothing Phone (2) ఈ సారి Andreno 730 GPU తో కలిసిన ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ Qualcomm Snapdragon 8+ Gen 1 SoC తో వస్తుంది. అలానే 12GB RAM మరియు 512GB వరకు స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 13 మరియు Nothing OS 2 తో నడుస్తుంది.ఈ ఫోన్ 5G సపోర్ట్ తో వస్తుంది. అలానే 4700mAh బ్యాటరీనీ కలిగి ఉంటుంది. అలానే 3 సంవత్సరాల పాటు OS అప్ డేట్స్ మరియు 4 సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్ డేట్స్ వస్తాయని కంపెనీ తెలిపింది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in