పుణ్యం, ఆరోగ్యం రెంటినీ ఏకకాలం లో ఇచ్చే కార్తీకమాస స్నానం..తెల్లవారు జామునే చేసే స్నానం వల్ల ఏం జరుగుతుందంటే..

Kartikamasa bath gives both virtue and health at the same time. What happens to an early morning bath?
Image Credit : The Hans India

కార్తీక మాసం మొదలైంది. కార్తీక మాసంలో తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజ చేస్తుంటారు. ఈ నెల రోజులు శివుడిని ఆరాధిస్తూ చేసే పూజలు మరియు స్నానాలు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఈ నెల రోజులు ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ చేయడం చేస్తారు. శరీరం చలిని తట్టుకుని కొత్త ఉత్తేజాన్ని(New excitement) పొందుతుందని పెద్దలు చెబుతుంటారు. చాలామంది కార్తీక మాసంలో మాంసాహారం తినడం కూడా మానేసి మరీ పూజలు చేస్తుంటారు. ఈ కార్తీక మాసానికి అంతటి ప్రాధాన్యతనిస్తారు.

కార్తీకమాసంలో తెల్లవారుజామున స్నానం చేయడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

శరీరంలో నూతన ఉత్తేజం :

ప్రతిరోజు చేసే స్నానం వేరు. కార్తీకమాసంలో చేసే స్నానం వేరు అని చెబుతారు మన పెద్దలు. ఈ మాసంలో చలి ఉంటుంది కనుక ఉదయం త్వరగా లేవడానికి ఇష్టపడరు. బద్దకం (Laziness) గా ఉండి ఏ పని చేయాలని అనిపించదు.

కనుక తెల్లవారుజామునే లేచి స్నానం చేయడం వల్ల బద్దకం వదిలి, కొత్త ఉత్తేజం శరీరంలోకి వస్తుంది. అంతేకాకుండా పనులు కూడా త్వరగా పూర్తవుతాయి‌. త్వరగా నిద్ర లేవడం వల్ల సహజంగా వచ్చే ఇన్ఫెక్షన్స్ నుండి ఉపశమనం లభిస్తుంది.

Also Read : Vaastu Tips : ప్రశాంత జీవితం కొనసాగాలంటే ఇంటిలో ఈ నియమాలను పాటించండి.

Kartikamasa bath gives both virtue and health at the same time. What happens to an early morning bath?
Image Credit : Religion World

ఒత్తిడి మరియు ఆందోళన తగ్గుతుంది :

తెల్లవారుజామున లేచి నడవడం కూడా శరీరానికి ఒక మంచి వ్యాయామం. అంతేకాకుండా నదిలో స్నానం చేయడం వల్ల ఒత్తిడి మరియు ఆందోళన (worry) లాంటి సమస్యలు తగ్గి మానసికంగా ఉత్సాహం నెల కొంటుంది.

Also Read : Vaastu Tips : మనీ పర్స్ ఇలా ఉంటే మహాలక్ష్మి మీ వెంటే

నదులు మరియు సముద్రాలలో స్నానం :

కార్తీక మాసంలో నదులు, కాలువలు, సముద్రాలలో స్నానం చేయడం మంచిదని అంటారు. ఎందుకనగా వానాకాలం ముగిసిపోతుంది. నదులలో ప్రవాహం తగ్గిపోతుంది. మలినాలు (impurities) అన్నీ అడుగుకు చేరతాయి. స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటితో స్నానం చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు అని పెద్దలు చెబుతుంటారు.

అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు :

కార్తీక మాసంలో పూజ చేసే సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారు. ఈ దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కార్తీకమాసంలో నువ్వుల నూనె (Sesame oil) మరియు నెయ్యితో దీపం పెట్టడం వలన దీపం నుండి వచ్చిన పొగను పీల్చడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ దీపం శరీరానికి వెచ్చదనాన్ని కూడా ఇస్తుంది.

Also Read : Vaastu Tips For Money Loss : సంపాదించిన డబ్బంతా ఖర్చవుతుందా? మీ చేతిలో డబ్బు నిలవాలంటే వాస్తు శాస్త్ర ప్రకారం ఇలా..

కాబట్టి కార్తీక మాసంలో చేసే స్నానం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే కార్తీక మాసంలో చాలామంది తెల్లవారుజామున (early morning) స్నానం చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in