Telugu Mirror : గూగుల్ పే గురువారం దాని ఫ్లాట్ ఫారమ్ లో మరో కొత్త ఫీచర్ ను విడుదల చేసింది.ఈ కొత్త ఫీచర్ ద్వారా UPI పిన్ ను ఉపయోగించకుండా కస్టమర్ లు చిన్న చిన్న లావాదేవీలను చేయవచ్చు.UPI లైట్ ఇది Google Pay యొక్క నూతన ఫీచర్.ఇది వినియోగదారుల రెగ్యులర్ UPI లావాదేవీలతో పోల్చినప్పుడు, అధిక సక్సెస్ రేటును కలిగి ఉండి, బిజీగా ఉన్న పీక్ అవర్స్ లో కూడా స్పీడ్ గా చెల్లింపులు చేయడానికి అవకాశం కలిగి ఉంటుంది అని గూగుల్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.UPI లైట్ వాలెట్ ని Google Pay యాప్ లోనే డౌన్ లోడ్ చేసుకొని వినియోగించవచ్చు.లైట్ వాలెట్ లో ఒకేసారి రూ.2,000 వరకు డిపాజిట్ ఉంచవచ్చు.ఈ బ్యాలెన్స్ ను ఒక్కో చెల్లింపుకి రూ.200 వరకు వాడుకోవచ్చు.
Monsoon Diseases : వర్షాకాలంలో వ్యాధులకు గుడ్ బై చెప్పాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
అయితే, ప్రస్తుతం గూగుల్ లైట్ వాలెట్ ని ఉపయోగించేవారు రోజుకు రెండుసార్లు మాత్రమే రూ.2000 దాకా లోడ్ చేసుకునే అవకాశం ఉంది.దీని ద్వారా గూగుల్ లైట్ వాలెట్ లో రోజుకి రూ.4,000 ని ఖర్చు చేసేందుకు వీలుగా పరిమితం చేశారు.అసలు UPI లైట్ వాలెట్ ను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ 2022 వ సంవత్సరం, సెప్టెంబర్ లో చిన్న మొత్తాల విలువ కలిగిన UPI చెల్లింపులను వేగంగా మరియు సులభంగా చేసుకునేందుకు వీలుగా ప్రారంభించారు.ఇప్పుడు ప్రస్తుతం 15 బ్యాంక్ లు UPI లైట్ ను వినియోగించేందుకు మద్దతుగా ఉన్నాయి.
ఇంతకు ముందు BHIM UPI యాప్,Paytm అలాగే Phone Pay లలో UPI లైట్ ద్వారా చెల్లింపు ప్రక్రియను మొదలు బెట్టాయి.
అంబరీష్ కెంఘే, Google సంస్థ ఉత్పత్తి మరియు నిర్వహణ మరియు నిర్వహణ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ “ప్రత్యేకమైన ఆఫర్ లు మరియు వాలెట్ ను ఉపయోగించే సమయాలలో దేశంలో డిజిటల్ పేమెంట్స్ ను తీసుకురావడానికి ప్రధానమైనవి మరియు గూగుల్ ప్లాట్ ఫారమ్ ద్వారా UPI LITE తో చెల్లింపులతో, వాలెట్ ని ఉపయోగించేవారికి అనుకూలమైన, కాంపాక్ట్ మరియు అత్యంత వేగవంతమైన చెల్లింపుల అనుభవాన్ని వినియోగదారుడు పొందటంకోసం సహాయకారిగా ఉంటూ చిన్న – విలువ చెల్లింపులను సులువుగా చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.”
Fixed Deposite : మీ డబ్బు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు ?
Google Pay లో UPI లైట్ ఫీచర్ ని యాక్టివేట్ చేసే విధానం:
• గూగుల్ లైట్ ని యాక్టివేట్ చేసుకునే వారు స్మార్ట్ ఫోన్ లో తమ ప్రొఫైల్ పేజీ కి వెళ్ళి, ‘UPI లైట్ ని యాక్టివేట్ చేయి’ అన్న దాని మీద ట్యాప్ చేయాలి.
• లింకింగ్ చేసే విధానం పూర్తయిన తరువాత,వినియోగ దారులు వారి యొక్క UPI లైట్ ఖాతాకు రూ.2,000 వరకు యాడ్ చేయగలరు.
• వారి UPI లైట్ బ్యాలెన్స్ ను అనుసరించి రూ.200 కంటే తక్కువ లేదా సమానమైన చెల్లింపు విలువ కోసం,UPI లైట్ ఖాతా డిఫాల్ట్ గా ఎన్నుకోవడం జరుగుతుంది.
• చెల్లింపులను పూర్తి చేయడానికి UPI లైట్ వినియోగదారులు “పిన్ – ఉచితంగా చెల్లించండి” మీద క్లిక్ చేయాలి.