Telugu Mirror: భారతదేశంలోని పిల్లల తల్లిదండ్రులకు మరియు మందులు తయారీ దారుల సంస్థకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా చీఫ్ డాక్టర్ రాజు సింగ్ రఘు వాన్షి హెచ్చరికతో కూడిన లేఖను డిసెంబర్ 18న విడుదల చేశారు,
ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్లో వాడే chlorpheniramine maleate IP 2mg మరియు phenylephrine HCL IP 5mg ని నాలుగు సంవత్సరాల లోపు పిల్లలకు ఈ కాంబినేషన్ వాడకూడదని లేఖలో పేర్కొంది.
ఈ ఉత్తర్వు పక్కన పెడితే, DCGI అన్ని రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంతాల డ్రగ్ కంట్రోలర్లకు లేఖ రాసింది, డ్రగ్స్ లేబుల్‌పై “FDCని 4 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఉపయోగించరాదు” అనే హెచ్చరికను స్పష్టంగా గుర్తు పెట్టేలా తమ పరిధిలోకి వచ్చే తయారీదారులను ఆదేశించాలని అభ్యర్థించారు.
సాధారణంగా జలుబు, నీరు కారడం, ముక్కులు కారడం, తుమ్ములు మరియు గొంతులో నాసికా భాగాలలో దురద, ఫ్లూ వంటి లక్షణాలు తగ్గడానికి ఈ రెండు కాంబో మెడిసిన్ లు త్వరగా ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. Phenylephrine లేదా రక్త నాళాలు ఉపశమనానికి పరిమితం, ఒక decongestant పనిచేస్తుంది, అయితే chlorpheniramine అలెర్జీ తగ్గడానికి పనిచేస్తుంది.
ఫార్మా కంపెనీలు అయిన గ్లాక్సో స్మిత్‌క్లైన్ (GlaxoSmithKline), టి-మినిక్ ఓరల్ డ్రాప్స్ (T-Minic Oral Drops), గ్లెన్‌మార్క్ (Glenmark) ద్వారా అస్కోరిల్ ఫ్లూ సిరప్ (Ascoril Flu Syrup) మరియు ఐపిసిఎ లేబొరేటరీస్ (IPCA Laboratories), సోల్విన్ కోల్డ్ సిరప్ (Solvin Cold Syrup)లు వాటితో పాటు ఇతర కంపెనీలకు కూడ, రెగ్యులేటర్ “హెచ్చరిక”ను చేర్చవలసిందిగా అభ్యర్థించింది.
మాత్రల ఉపయోగం చికిత్సాపరంగా సమర్థించబడదని పేర్కొంటూ జూన్‌లో ప్రభుత్వం ఈ 14 FDC మందులను నిషేధించింది. నిర్దిష్ట మోతాదు కలయికలలో రెండు లేదా అంతకంటే ఎక్కువ మందులను కలపడం స్థిర మోతాదు కలయికగా పిలువబడుతుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడ స్థిర ఔషధం కలయికలో ఫినైల్ఫ్రైన్ మరియు క్లోర్ఫెనిరమైన్ మెలేట్ ఉంటాయి అని చెపుతూ, ఇవి తరచుగా జలుబు లక్షణాల చికిత్స కోసం సిరప్లు మరియు మాత్రలలో వాడుతూ ఉంటారు అని తెలిపింది. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో దగ్గు మరియు జలుబు లక్షణాల చికిత్స కోసం, ఎలాంటి దగ్గు సిరప్లు లేదా మందులను ఉపయోగించవద్దు అని తెలిపింది.