Telugu Mirror: సింహం ఈ పేరు వినగానే కళ్ళ ముందు దాని రూపం కదలాడుతుంది.ఎక్కడో భయం వేస్తుంది.దూరం నుంచి చూడాలన్నా మనసులో భయంతోనే చూస్తుంటాం.అలాంటిది సింహం ప్రక్కనే కూర్చోవాలంటే ఫీజులు ఎగిరి పోతాయి కానీ సింహం దగ్గర కూర్చొని సింహం తో కలసి ఒకే ప్లేట్ లో మాసం తినడం అంటే మామూలు విషయం కాదు అదీ కూడా ఓ మహిళ ఒళ్ళు గగుర్పొడిచే ఈ వీడియో ఇప్పుడు వైరల్(Viral Video) గా మారింది.
అడవికి రారాజు సింహం(Lion) రాజసం ఉట్టిపడుతూ గంభీరంగా ఉన్న సింహంతో భోజనం చేయడానికి ధైర్యం కలిగిన మహిళ ను వీడియోలో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇన్స్టాగ్రామ్(Instagram) లో వైరల్ అయిన ఈ వీడియోలో ఒక మహిళ తనకు సింహానికి మధ్యన ఉన్న ప్లేట్ లోని మాంసాన్ని తీసుకోవడం కనిపిస్తుంది.ఓ వైపు సింహం ప్లేట్ లో తనకు కేటాయించిన మాంసాన్ని మింగుతూ వుంటే మరో పక్క ఆ మహిళ హాయిగా కూర్చొని ప్లేట్ లోని మాంసాన్ని తీసుకుని తింటుంది.భయంకరమైన సింహం ప్రక్కన విస్మయం కలిగించేలా ఎంతో సులభంగా,ధైర్యవంతురాలైన మహిళ ప్లేట్ లోని మాంసం ముక్కను తీసుకుంటుంది.
Also Read: Youtube Treatment: యువకుడి ప్రాణం తీసిన యూట్యూబ్ వైద్యం
UAE లోని వైల్డ్ లైఫ్ పార్క్(Wild life park) నుండి బయటకు వచ్చిన అన్ బిలీవబుల్ లాంటి ఈ వీడియో 3.7 మిలియన్ లకు పైగా వ్యూస్ తో వెంటనే వైరల్ గా మారింది.
ఈ వీడియోని చూసిన నెటిజన్ లు వివిధ రకాల కామెంట్ లను చేస్తున్నారు.
Also Read:RainFall : తెలంగాణలో భారీ వర్షాలు, ఉత్తర తెలంగాణకు రెడ్ ఎలర్ట్ జారీ..
View this post on Instagram
ఒక నెటిజన్ తన ఆందోళనను వ్యక్తం చేస్తూ”ప్లేట్ లోది అయిపోయిన తర్వాత రారాజు నిన్ను తింటాడు!అవి అడవి లో పెరిగే జంతువులు,పెంచుకున్న జంతువులు కాదు.”
ఉత్సాహంతో ఉన్న మరో నెటిజన్ వ్యాఖ్యని చూస్తే “అక్కడికి వచ్చి చూడటానికి వేచి ఉండలేను!” అని అతని వ్యాఖ్యలో, అతనికి మనసులో భయంగా ఉన్నా గానీ ప్రత్యేక మైనటువంటి ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడాలనే కోరిక కనిపిస్తుంది అతని కామెంట్ లో.
మరొక వినియోగ దారుడు ఇలా వ్రాశాడు “అవును ,ఇది ఖచ్చితంగా ప్రమాదం జరగడానికి సిద్దంగా ఎదురు చూస్తుంది.దాని ఆహారాన్ని కాపాడుకోవడం దాని సహజ లక్షణం, సింహం నుండి ఎవరైనా ఏమి ఆనందిస్తారు?”
మరొకరు సింపుల్ గా ఇలా వ్రాశారు,”ఏం జరిగినా..నేను సింహం వైపు! అంటూ వ్రాశాడు.
మరొకరు చమత్కారంగా “మెయిన్ డిష్ మీతో డెజర్ట్ తింటున్నప్పుడు.” అని వ్రాశారు.