జోధ్‌పూర్‌లో బిచ్చగాడిగా దుస్తులు ధరించిన ఒక వ్యక్తి ఐఫోన్ 15 ని నాణేలతో కొనుగోలు చేయడానికి ప్రయత్నించినప్పుడు మొబైల్ స్టోర్ ఉద్యోగుల రియాక్షన్ ఎలా ఉంటుందో అంచనా వేయడానికి ‘ఎక్స్ పెరిమెంట్ కింగ్’ అనే ఇన్ స్టా గ్రామ్ ఛానెల్ సోషల్ ఎక్స్ పెరిమెంట్ నిర్వహించి, ఆ వీడియోని షేర్ చేసింది.
ఇన్ స్టా ఛానెల్ షేర్ చేసిన వీడియోలో, బిచ్చగాడు మొబైల్ షోరూమ్‌లను సందర్శిస్తాడు కానీ అతను ధరించిన దుస్తుల కారణంగా అనేక షోరూమ్ లు అతనిని షాప్ లోకి అనుమతించనప్పటికీ, మొత్తంమీద ఒక మొబైల్ షోరూమ్ వారు ఆ బిచ్చగాడిని లోపలికి అనుమతించారు. అలాగే నగదు చెల్లింపుగా నాణేలను తీసుకోవడానికి అంగీకరించారు. బిచ్చగాడు తన దగ్గరున్న సంచిలోని నాణేల (Coins) ను నేలపై పోసి నాణేల మూటను ఖాళీ చేసి, దానిని దుకాణదారుడు మరియు సిబ్బందికి అందజేశాడు, వారు వాటిని లెక్కించిన అనతరం, అతనికి ఐఫోన్ ప్రో మాక్స్‌ను అందించారు, దానిని అతను ఆనందంతో పొందుతాడు.
View this post on Instagram
షేర్ చేసినప్పటి నుండి, ఈ వీడియోకు 40 మిలియన్లకు పైగా లైక్‌లు వచ్చాయి. నెటిజన్లు హాస్యం మరియు వ్యంగ్యంతో ప్రతిస్పందించారు, కొందరు నెటిజన్ లు మాత్రం ఈ వీడియో స్క్రిప్ట్ లాగా ఉందని అన్నారు.
సోషల్ మీడియా యూజర్ ఒకరు ఈ విధంగా పేర్కొన్నాడు, “ఇది స్క్రిప్ట్ చేయబడింది. ఈ రోజులలో ఏ బిచ్చగాడు అతనిలా కనిపించడం లేదు.”
మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు ఒక వ్యక్తిని వారి దుస్తులను బట్టి అంచనా వేయవద్దని పేర్కొన్నాడు.
మూడవ యూజర్ మాత్రం “బ్రాండెడ్ బిచ్చగాడు” అని మరియు “బ్రాండెడ్ బిఖారీ” అని పేర్కొన్నాడు.
మరొక వినియోగదారు, “వినోదకరమైన మరియు ఆలోచింపజేసే ప్రయోగం” అని వ్యాఖ్యానించారు.
కొంతమంది వ్యూయర్స్ ఈ ప్రయోగాన్ని మెచ్చుకున్నారు, మరికొందరు మొబైల్ స్టోర్ ఉద్యోగుల హృదయపూర్వక ప్రతిస్పందనతో మునిగిపోయారు.
Also Read : ఇకపై ఈ స్మార్ట్‌ఫోన్‌లలో అక్టోబరు 24 నుంచి వాట్సాప్ పని చేయదు
యాపిల్ ఫెస్టివల్ సీజన్ సేల్, భారీ ఆఫర్లతో ఐఫోన్స్, ఐపాడ్స్ ఇంకా మరెన్నో
ఇదిలా ఉండగా కొత్త iPhone సిరీస్ లో iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro మరియు iPhone 15 Pro Maxతో సహా నాలుగు వేరియంట్ లు ఉన్నాయి. Apple వినియోగదారులు కంపెనీ అధికారిక స్టోర్‌లు మరియు దాని వెబ్‌సైట్ నుండి తాజా iPhone వెర్షన్ లను కొనుగోలు చేయవచ్చు. iPhone 15 నాలుగు కొత్త మోడల్ లలో తక్కువ ఖరీదు కలిగినది మరియు 128GB డివైజ్ ధర రూ. 79,900, అయితే 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 89,900 మరియు 512GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 109,900.