A I Anchor:కన్నడ న్యూస్ రీడర్ గా సౌందర్య

AI ప్రపంచం అంతా వ్యాపించింది. ఇంకా భవిష్యత్ లో ఏం సంచలనం సృష్టిస్తుందో. AI తోనే ఆగుతుందా లేక ఇంకా ఎక్కువ ఆవిష్కరణలు వస్తాయా? ఇప్పటి కైతే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) సంచలనంగా మారింది. రోజుకొక కొత్త రూపులో వస్తుంది ప్రస్తుతం AI.

విశ్వ వ్యాపితంగా ప్రజలను ఆకర్షించేందుకు AI ప్రారంభమైంది.ఇప్పుడు భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజి(Artificial intelligence technology) ద్వారా న్యూస్ రీడర్ గా పని చేయడం ప్రారంభమైంది. భారత దేశంలో AI ద్వారా పనిచేస్తున్న రెండవ న్యూస్ రీడర్ అలాగే దక్షిణ భారతదేశంలో మొదటి AI న్యూస్ రీడర్.

Also Read:Skin Tips:ఫేస్ ప్యాక్ లే కాదు ఇంటి చిట్కాలు కూడా ప్రకాశించే చర్మ సౌందర్యాన్ని ఇస్తాయి

కొన్ని రోజుల క్రింద ఒడిస్సా వార్తా సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ న్యూస్ రీడర్ ని పరిచయం చేసింది. AI న్యూస్ రీడర్ కు ఒడిస్సా వార్తా సంస్థ వారు ‘లిసా(Lisa)’ గా పేరు పెట్టారు. ఈ పరిస్థితులలో ‘పవర్ టీ వీ’ అనే కన్నడ భాషా TV ఛానెల్ వారు కన్నడ భాషలో మాట్లాడే ‘సౌందర్య’ అనే పేరుగల ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) న్యూస్ రీడర్ గా తనకు తాను పరిచయం చేసుకున్నది.

Also Read:ISRO : నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిసిన చంద్రయాన్-3..

కన్నడ AI న్యూస్ రీడర్ సౌందర్య పవర్ టీవీ(soundhrya power tv) లో మాట్లాడుతూ “అందరికీ నమస్కారం.AI టెక్నాలజి ఇప్పుడు అన్ని విభాగాలలో తన ప్రతిభను ప్రదర్శిస్తూ తనదైన శైలిలో అన్నిటా AI తన ముద్రను వేస్తోంది. AI ప్రవేశించిన రంగాలలో వార్తా సంస్థలు కూడా ఉన్నాయి.AI సౌత్ ఇండియాలో వార్తలను అందిస్తోంది. నా పేరు సౌందర్య నేను భారతదేశంలో రెండవ AI న్యూస్ రీడర్ ను అలాగే దక్షిణ భారతదేశంలో మొదటి AI న్యూస్ రీడర్ ” అని పరిచయం చేసుకుంది.

న్యూస్ రీడర్(News Reader) గా వస్తున్న సౌందర్యను కేవలం వార్తలు చదవటానికే కాకుండా పవర్ టీవీ లో వివిధ కార్యక్రమాలలో నటించేలా ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.