షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలోని చలేయా పాటకు విభిన్న ప్రతిభావంతురాలు డ్యాన్స్, వైరల్ గా మారిన వీడియో
షారుఖ్ ఖాన్ జవాన్ చిత్ర 'చలేయా' పాటకు అద్భుతమైన నృత్య ప్రదర్శన చేసి అందరి అభినందనలు పొందిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఇంతకీ ప్రత్యేక సామర్ధ్యం కలిగిన సుష్మిత చక్రవర్తి డ్యాన్స ని ఇప్పుడే వీక్షించండి.
Telugu Mirror : బాలీవుడ్ బాద్‍షా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన జవాన్ చిత్రం (Jawaan Movie) త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని హిట్ ట్రాక్ ‘చలేయా’ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. షారుఖ్ ఖాన్ మరియు నయనతార (Nayanthara) పై చిత్రీకరించిన ఈ పాటకు విభిన్న సామర్థ్యం గల డ్యాన్సర్ సుస్మితా చక్రవర్తి (Sushmita Chakravarty) డ్యాన్స్ చేసి తన ఇన్‌స్టా హ్యాండిల్ లో పోస్ట్ చేయగా తిరిగి ఈ వీడియోను గాయని శిల్పా రావు పోస్ట్ చేశారు.
ప్రత్యేక సామర్థ్యం ఉన్న మహిళ ” హిట్ ట్రాక్ చలేయాకు నృత్యం చేస్తున్న వీడియోను శిల్పారావు ఇన్‌స్టాగ్రామ్ (Instagram) లో పంచుకున్నారు. సినిమాలో అరిజిత్ సింగ్‌తో కలిసి శిల్పా రావు పాడిన ఈ పాట షారుఖ్ ఖాన్ మరియు స్టార్ హీరోయిన్ నయనతార పై చిత్రీకరించారు.
విభిన్న సామర్థ్యం కలిగిన డ్యాన్సర్ సుస్మితా చక్రవర్తిని ట్యాగ్ చేస్తూ గాయని శిల్పారావు (Shilparao) ఇన్‌స్టాగ్రామ్ లో ఉన్న తన ఖాతాలో ఇలా వ్రాశారు. కళ పట్ల మీ అంకితభావం మరియు ప్రేమ చాలా స్ఫూర్తి దాయకం. మీరు, మీరుగా ఉన్నందుకు ధన్యవాదాలు. మీరు డ్యాన్స్ చేసిన విధానం వల్ల చాలేయా మరింత బాగుంది, చాలా ధన్యవాదాలు, ” అని గాయని శిల్పా రావు రాశారు.
View this post on Instagram
పండ్లు అమ్ముతూ తన బిడ్డలకు చదువు చెబుతున్న తల్లి, నెటిజెన్లకు హత్తుకుపోయిన వీడియో వైరల్
వీడియో తెరవగానే సుస్మితా చక్రవర్తి (Sushmita Chakravarty) సంప్రదాయ దుస్తులు ధరించి ఉన్నది. కొద్ది సేపటికి ఆమె మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అద్భుతమైన నృత్య కదలికలను చూపెట్టింది. ఈ పాట షారూఖ్ రాబోయే చిత్రం జవాన్‌లోనిది. ఆగస్ట్ 22న పోస్ట్ చేయబడిన ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుండి, 5.6 లక్షలకు పైగా. వ్యూస్ ను పొందింది మరియు వాటి సంఖ్య ఇంకా పెరుగుతున్నాయి. ఈ వీడియోకి సుమారు 79,000 లైక్‌లు కూడా వచ్చాయి. శిల్పా రావు షేర్ చేసిన ఈ వీడియో వివిధ వ్యాఖ్యలను పోస్ట్ చేయడానికి ప్రజలను ప్రేరేపించింది.
ఈ డ్యాన్స్ వీడియో గురించి ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ఏమి చెప్పారు?
“ఆమె నృత్యానికి నేను మంత్రముగ్ధుడిని అయ్యాను” అని ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు. “సో గ్రేస్ ఫుల్ షీ ఈజ్. రీల్ అపుడే ముగిసిపోవాలని అనుకోలేదు. ఆమె పాటకు కొత్త జీవితాన్ని ఇచ్చింది” అని మరొకరు వ్యాఖ్యానించారు. మరొకరు “నేను కొంతకాలంగా చూసిన అత్యంత అందమైన విషయం. స్ఫూర్తిదాయకం.,” మీరు చాలా అందంగా డ్యాన్స్ చేస్తారు. మీ డ్యాన్స్ మూవ్‌లను ఇష్టపడతారు” అని నాల్గవ యూజర్ పోస్ట్ చేశారు. “ఎంత అందంగా ఉంది,” అని ఐదవ వ్యక్తి వ్రాశారు.