Telugu Mirror : దేశ వ్యాప్తంగా టమోటా ధరలు విపరీతంగా పెరిగిన కారణంగా మహారాష్ట్రలోని పూణే జిల్లాకు చెందిన రైతు టమోటాలను అమ్మడం ద్వారా కోటీశ్వరుడు అయ్యాడు. మొత్తం పంట అమ్మడం ద్వారా రూ.3.5 కోట్ల రాబడిని సాధించాలని ప్రస్తుతం టార్గెట్ ని పెట్టుకున్నాడు.మహారాష్ట్ర లోని పూణే జిల్లాకి చెందిన ఈశ్వర్ గయాకర్,అతని భార్య తో కలిసి వారి పొలంలో టమాటాను పండించినారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం విపరీతంగా టమోటా ధరలు పెరగడంతో అతని దశ తిరిగింది.ఈశ్వర్ పొలంలో పండించిన టమాటాను అమ్మడం వల్ల ఇప్పటికి రూ.2.8 కోట్లకు పైనే సంపాదించినట్లు తెలిపాడు.ఇంకా అతని దగ్గర మిగిలిఉన్న దాదాపు 4000 క్రేట్లు టొమోటాలను అమ్మి ఇంకా ఎక్కువ సొమ్ము రూ.3.5 కోట్లను సాధించాలనే టార్గెట్ ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు.
Make Up Tips : మేకప్ వేసుకునే ముందు మీ చర్మాన్ని ఇలా సిద్ధం చేసుకోండి..
వార్తా సంస్థ ప్రతినిధులతో ఈశ్వర్ గైకర్ తను పడిన కష్టాన్ని , అతని ధృడ సంకల్పాని గుర్తుచేసుకుంటూ..”ఇదంతా నేను ఒక్క రోజులో సాధించినది కాదు, 6 – 7 సంవత్సరాల నుండి నేను నా 12 ఎకరాల భూమిలో టమాటాను సాగు చేస్తున్నాను. నాకు ఎన్నో సార్లు నష్టం వచ్చింది కాని నేను ఎప్పుడు నా నమ్మకాన్ని కోల్పొలేదు. 2021 లో నాకు దాదాపు 20 లక్షల నష్టం వచ్చింది, కాని నేను టమాటాలను పండించడం ఆపలేదు.” అని పేర్కొన్నాడు.ఈశ్వర్ గైకర్ ఎప్పటిలానే ఈ సంవత్సరం కూడా 12 ఎకరాల పొలంలో టమోటాలు పండించాడు.ఇప్పటి వరకు గైకర్ 17,000 క్రేట్ లను అమ్మినారు.
ఒక్కో క్రేట్ ను రూ. 700 నుండి రూ. 2311 ధరకు అమ్మినారు. 17,000 క్రేట్లను విక్రయించడం ద్వారా ఇప్పటివరకు రూ.2.8 కోట్ల ఆదాయం లభించింది.ఇంకా సుమారు 3000 నుండి 4000 క్రేట్ ల టమోటా స్టాక్ ఉంది. అవికూడా అమ్మడం వలన అతని సంపాదన సుమారుగా రూ.3.5 కోట్లకు వస్తుందని ANI వార్తా సంస్థ వెల్లడించింది.టమాటాకు వచ్చిన ధరతో మా కుటుంబం అంతా సంతోషంగా ఉన్నామని. ఇదంతా తనకు కుటుంబం ఇచ్చిన మద్దతు అలాగే తాతయ్య,తల్లిదండ్రులు ఇచ్చిన ఆశీర్వాదాలు మరియు తనతో పాటు పొలం లో పనిచేసే తన భార్య ప్రోత్సాహం తో ఈ విజయానికి కారణం అంటూ గైకర్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
Tamil Star Hero : తలపతి విజయ్ చూపు చదువుల వైపు..
ఇది అస్సలు ఊహించలేదని మొదట టమోటాలు కిలో 30 రూపాయల ధరకు లభిస్తుంది అనుకున్నామని కానీ అదృష్టం బాగుండి రేటు గణనీయంగా పెరగడం మూలాన ఫలితం మారిపోయింది. పంట దిగుబడి బాగా పెరిగింది దాని ద్వారా చక్కని రాబడి వచ్చింది.ఈశ్వర్ గైకర్ 2005 నుంచి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వృత్తి లో భాగంగా అతని భార్య తోడ్పాటుతో వ్యవసాయం చేసుకుంటూ 2017 నుండి భార్య ఇతర కూలీల మద్దతుతో ఒక్క ఎకరా నుంచి 12 ఎకరాలకు చేరుకుంది. ఒక్క టమోటా పంటనే కాకుండా గైకర్ కుటుంబం ఆయా సీజన్ లను అనుసరించి ఉల్లిపాయలు,అలాగే పూలను కూడ పండిస్తారు.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…