Aadhaar Update : 10 ఏళ్ళు దాటితే ఆధార్ పని చేయదా? వెంటనే అప్డేట్ చేసుకోండి!
ఒక వ్యక్తి పదేళ్లకు పైగా ఆధార్ కార్డును కలిగి ఉండి, జూన్ 14, 2024లోగా కార్డ్ వివరాలను అప్డేట్ చేయకుంటే, ఆ కార్డ్ చెల్లుబాటు కాదు అనే వార్తలు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
Aadhaar Update : మన దేశంలో ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ లో ఒకటి. ఆధార్ కార్డ్ ఉంటేనే భారతీయులుగా పరిగణిస్తారు. ఆధార్ లేకుంటే ప్రభుత్వ పథకాలకు అనర్హులు కావడమే కాకుండా పాఠశాలల్లో అడ్మిషన్లు పొందలేరు ఇంకా ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉద్యోగం పొందలేరు.
‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (UIDAI) నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి వారి వ్యక్తిగత సమాచారం మారినప్పుడల్లా వారి ఆధార్ కార్డును అప్డేట్ చేయాలి. ఆధార్ కార్డు 10 సంవత్సరాల క్రితం జారీ చేయబడి, వివరాలు అప్డేట్ చేయకపోతే, ఖచ్చితంగా దానిని అప్డేట్ చేయాలి.
పదేళ్లు దాటితే ఆధార్ కార్డులు పని చేస్తున్నాయా?
ఒక వ్యక్తి పదేళ్లకు పైగా ఆధార్ కార్డును కలిగి ఉండి, జూన్ 14, 2024లోగా కార్డ్ వివరాలను అప్డేట్ చేయకుంటే, ఆ కార్డ్ చెల్లుబాటు కాదు అనే వార్తలు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై ఈ వార్త యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అవాస్తవం అని తెలిపింది.కాగా, ఉచిత ఆధార్ కార్డు అప్డేట్కు జూన్ 14ను డెడ్‌లైన్‌గా నిర్ణయించినట్లు ప్రకటించారు. జూన్ 14లోగా అప్డేట్ కాకపోయినా, ఆధార్ యథావిథంగా పనిచేస్తుందని, ఆ తేదీ తర్వాత కూడా వివరాలను సవరించే అవకాశం ఉంటుందని తెలిపింది.
ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేయడం ఎలా?
మీ ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్‌గ్రేడ్ చేయడానికి ఈ ఏడాది జూన్ 14 వరకు గడువు ఉంది. ఈ సమయం తర్వాత, ఆధార్ కార్డును అప్డేట్ చేయడానికి తప్పనిసరిగా డబ్బు ఖర్చు చెల్లించాల్సి వస్తుంది.ప్రస్తుతం, ఎటువంటి ఖర్చు లేకుండా మీ ఆధార్ కార్డ్ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు.
- ముందుగా, myaadhaar.uidai.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
- మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
- అలాగే, మీ ఆధార్-లింక్ అయిన ఫోన్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసి లాగిన్ చేయండి.
- ‘అప్డేట్ ఆధార్’ ఆప్షన్ ను ఎంచుకోండి. ఇక్కడ, మీరు సవరించాలనుకుంటున్న సమాచారాన్ని ఎంచుకోండి.
- ఇక్కడ, మీరు మీ మొబైల్ నంబర్ మరియు ఇతర సమాచారాన్ని అప్డేట్ చేయవచ్చు, అలాగే తగిన పత్రాలను అప్లోడ్ చేయాలి.
- మీ వివరాలు మరియు పత్రాలను అప్లోడ్ చేసిన తర్వాత, ‘సబ్మిట్’ బటన్‌ను క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి 14-అంకెల అప్డేట్ రిక్వెస్టింగ్ నంబర్ వస్తుంది.
- ఈ నంబర్‌తో, మీరు మీ ఆధార్ అప్డేట్ స్టేటస్ ను ట్రాక్ చేయవచ్చు.
Comments are closed.