Aadhar Card Personal Details Update: మన దేశంలో ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ లో ఒకటి. ఆధార్ కార్డ్ ఉంటేనే భారతీయులుగా పరిగణిస్తారు. ఆధార్ లేకుంటే ప్రభుత్వ పథకాలకు అనర్హులు కావడమే కాకుండా పాఠశాలల్లో అడ్మిషన్లు పొందలేరు ఇంకా ప్రైవేట్ విద్యాసంస్థ (Private Institutes) ల్లో ఉద్యోగం పొందలేరు.
‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (UIDAI) నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి వారి వ్యక్తిగత సమాచారం మారినప్పుడల్లా వారి ఆధార్ కార్డు (Aadhar Card) ను అప్‌డేట్ చేయాలి.
ఆధార్ కార్డ్‌లలో పేరు మరియు చిరునామాను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి గడువు సమీపిస్తోంది. గడువు ముగిసేలోపు కార్డ్ హోల్డర్లు (Card Holders) తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవడం మంచిది.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ ఉచిత అప్‌డేట్ కోసం గడువును జూన్ 14, 2024గా నిర్ణయించింది. ఆధార్ అప్‌డేట్ కోసం అవసరమైన పత్రాలు మరియు చిరునామా ప్రూఫ్‌ల (Address Proof) ను అప్‌లోడ్ చేయడానికి గడువు ఆ రోజుతో ముగుస్తుంది మరియు ఈ ఉచిత సేవలను MyAadhaar పోర్టల్లో పొందవచ్చు.
గడువు ముగిసిన తర్వాత, పత్రాలను నేరుగా సమర్పించినప్పటికీ, ఆధార్ కార్డ్‌లోని వివరాలను అప్‌డేట్ చేయడానికి మరియు పత్రాలను సమర్పించడానికి వినియోగదారులు ప్రతి సర్వీస్ కు రూ.50 చెల్లించాలి. ఆధార్ అనేది బయోమెట్రిక్ (Bio Metric) మరియు డెమోగ్రాఫిక్ (Demographic) సమాచారంతో భారతీయులకు కేటాయించబడిన 12-అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. 10 సంవత్సరాల క్రితం ఆధార్‌ను జారీ చేసిన వారు ఆ తర్వాత దానిని అప్‌డేట్ చేయకుంటే దానిని అప్‌డేట్ చేయాలని UIDAI కోరుతోంది.
ఆన్లైన్ లో ఉచితంగా అప్డేట్ చేసుకోడానికి ప్రాసెస్ ఇదే..
మీ ఆధార్ ప్రొఫైల్ (Aadhar Profile) ను అప్‌డేట్ చేయడానికి, మీ ఆధార్ నంబర్ మరియు వన్-టైమ్ పాస్‌వర్డ్‌తో https://myaadhaar.uidai.gov.in/కి లాగిన్ చేయండి. మీ వివరాలు, చిరునామా మరియు గుర్తింపు సమాచారాన్ని చెక్ చేయండి. తప్పుగా ఉంటే, “ఐ వెరిఫై దట్ ద ఎబో డీటెయిల్స్ ఆర్ కరెక్ట్” ట్యాబ్‌ను క్లిక్ చేయండి. JPEG, PNG లేదా PDF ఫార్మాట్‌లో గుర్తింపు పత్రాన్ని (2 MB కంటే తక్కువ) ఎంచుకోండి. మీ చిరునామా పత్రాన్ని అప్‌లోడ్ చేసి ఉచితంగా సబ్మిట్ చేయండి.
ఆఫ్ లైన్ లో ఎలా అప్డేట్ చేసుకునే విధానం..
ఆఫ్‌లైన్‌లో అప్‌డేట్ చేయడానికి, వినియోగదారులు https://bhuvan.nrsc.gov.in/aadhaar/ని సందర్శించవచ్చు లేదా సెంటర్స్ నియర్ బై ట్యాబ్ పై క్లిక్ చేసి, మీకు దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రాల (Aadhar Center) ను తెలుసుకోవాలి. వారు సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించి సంబంధిత పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది, అయితే మీరు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత సేవలు ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.