Aadhar Update Last Date: ఆధార్ అప్డేట్ తప్పనిసరి, జూన్ 14 లాస్ట్ డేట్
ఆధార్ కార్డులోని వివరాలను మార్చుకోవడానికి జూన్ 14 చివరి గడువు అనే న్యూస్ వైరల్ అవుతుంది. అయితే, UIDAI తాజాగా దీనిపై స్పందించింది.
Aadhar Update Last Date: ప్రస్తుతం దేశంలో ఎక్కడైనా నివసించేందుకు ఆధార్ ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డు ఇప్పుడు ప్రతి పనిలో తప్పనిసరి అయింది. అయితే అన్నింటికీ ముఖ్యంగా మారిన ఆధార్ చుట్టూ తీవ్ర చర్చ జరుగుతోంది. కొంతమంది సోషల్ మీడియా (Social Media) వినియోగదారుల ప్రకారం, వచ్చే నెల జూన్ 14 నుండి ఆధార్ కార్డ్ ఇకపై చెల్లుబాటు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, UIDAI తాజాగా ఈ నివేదికపై స్పందించింది.
జూన్ 14లోగా వ్యక్తిగత వివరాలను అప్డేట్ చేయకపోతే ఆధార్ కార్డ్ (Aadhar Card) పనిచేయదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ప్రకటించింది. వివరాలను అప్డేట్ చేయడానికి జూన్ 14 చివరి తేదీ. అయితే, జూన్ 14లోగా ఆధార్ అప్డేట్ చేసుకోపోయిన ఆధార్ పని చేస్తుందని UIDAI పేర్కొంది. ఆధార్ కేంద్రాలలో ఫీజు చెల్లించి వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు అని పేర్కొంది. గతంలో, ఆధార్ అప్డేట్ చేసుకోవాలని UIDAI రెండుసార్లు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే.
Also Read: Low House Interest Rates: తక్కువ వడ్డీకే గృహ రుణాలు, రూ.75 లక్షల లోన్ కి ఈఎంఐ ఎంతంటే?
ఆధార్ కార్డులోని వివరాలను మార్చుకోవడానికి జూన్ 14 చివరి గడువు అని చెప్పారు. జూన్ 14లోగా ఆధార్‌లోని వివరాలను సవరించనప్పటికీ, ఆధార్ కార్డు పని చేస్తూనే ఉంటుంది. ఆధార్ కేంద్రాల్లో డబ్బులు చెల్లించి సమాచారాన్ని అప్ డేట్ చేసుకోవచ్చని సూచించారు. UIDAI ఉచిత ఆన్లైన్ ఆధార్ అప్డేట్ల కోసం గడువును డిసెంబర్ 14, 2023 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
ఆధార్ కార్డులోని సమాచారాన్ని ప్రతి పదేళ్లకోసారి అప్డేట్ చేయాలని యూఐడీఏఐ పేర్కొంది. మీరు మీ గుర్తింపు కార్డు మరియు చిరునామా వంటి డాక్యుమెంటేషన్ (Documentation) ను అందించాలని పేర్కొంది. ఈ మేరకు ఉదయ్ వెబ్సైట్ ద్వారా సమాచారాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. మీరు మీ గుర్తింపు కార్డు మరియు చిరునామా వివరాలను ఇంటర్నెట్లో అప్డేట్ చేస్తే, మీ ఆధార్ అప్డేట్ అవుతుంది. రేషన్ కార్డులు, కిసాన్ పాస్‌బుక్‌లు (Kisan Passbook) , పాస్‌పోర్ట్‌లు మరియు ఓటరు IDలు అన్నింటినీ ధృవీకరణ పత్రాలుగా ఉపయోగించవచ్చు.
అయితే, ఆధార్ అప్డేట్ చేయకపోతే.. ఆధార్ పనిచేయదు అని వచ్చిన వార్తలన్నీ వాస్తవాలు కాదని పేర్కొంది.
Comments are closed.