aarogyasri Pending: ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల, ఏపీలో కొనసాగుతున్న ఆరోగ్యశ్రీ సేవలు

పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించే ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే!

aarogyasri Pending: ఆరోగ్యశ్రీ (Arogyasri) అనేది రాష్ట్రంలోని నిరుపేద రోగులకు భరోసాను అందించే ఒక అద్భుతమైన పథకం. ఆరోగ్యశ్రీ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆయన ప్రారంభించిన విధానాన్ని అమలు చేస్తూనే ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆరోగ్యశ్రీ జరుగుతోంది. స్వల్ప ఆదాయ కుటుంబాలు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ఉచిత చికిత్స పొందుతున్నాయి.

ఈ మధ్య కాలంలో ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రకటించాయి. బకాయిలను వెంటనే చెల్లించాలని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో కు లేఖ రాశారని ఎన్నో వార్తలు వచ్చిన సంగతి మనకి తెలిసిందే. గత ఆరు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంపై ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ (AP Specialty Hospitals) అసోసియేషన్ అసంతృప్తిని వ్యక్తం చేసింది.

Also Read:Mudra Loan For New Business : వ్యాపారం చేయాలనుకుంటున్నారా? ఈ పథకం ద్వారా ఏకంగా రూ.10 లక్షలు లోన్  

అయితే, ఆంధ్రప్రదేశ్‌ (Andhrapradesh) లో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.203 కోట్ల బిల్లుల చెల్లింపులు జరిగాయని ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ లక్ష్మీశ మంగళవారం ప్రకటించారు. పెండింగ్‌ (Pending) లో ఉన్న ఇతర బకాయిలను వీలైనంత త్వరగా చెల్లిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రి యాజమాన్యాలు సహకరించాలని ఆయన కోరారు. సిఇఒ డాక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి వర్గాల వారికి ఆరోగ్య సమస్య తలెత్తితే ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకం ప్రాధాన్యతనిస్తోందన్నారు.

 

aarogyasri Pending

గడువు ముగిసిన ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపుపై ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు, ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) సభ్యులు చర్చించినట్లు సమాచారం. గత సంవత్సరం ఆగస్టు నుండి మొత్తం రూ.1500 కోట్ల ఓవర్‌డ్యూ బకాయిలను వెంటనే చెల్లించాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. నివేదికల ప్రకారం, ఈ బకాయి చెల్లింపులు చెల్లించకపోతే, అసోసియేషన్ సేవలను నిలిపివేస్తుంది. ఈ నిర్ణయంలో పెండింగ్ బిల్లుల (Pending Bills) నుంచి 203 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం (AP Government) విడుదల చేసింది. మిగతా బకాయిలను త్వరలో చెల్లిస్తున్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు (Aargoya Sree) యథావిధిగా కొనసాగుతాయని ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు.

Comments are closed.