AC Car Filter Change: మీ కారు A.C. ఎయిర్ ఫిల్టర్, ఎపుడు మార్చాలి? ఎలా మార్చాలి మీకు తెలుసా?
సమయానికి కారు ఎయిర్ ఫిల్టర్ మార్చకపోవటం వలన మన ఆరోగ్యనికి చాలా హానికరం, ఎయిర్ ఫిల్టర్ ఎపుడు మార్చాలి, మనం మన ఇంట్లో నుంచే ఎలా మార్చుకోవాలి అనే పూర్తి వివరాలు మీ కోసం.
Telugu Mirror : గత ఐదు సంవత్సరాలులో చిన్న, పెద్ద నగరాలలో ప్రజలలో కార్ వాడకం చాలా ఎక్కువైంది, మీరు కార్ వాడుతున్నట్లు అయితే ఈ ముఖ్యమైన సమాచారం మీ కోసమే, మనలో చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి కారు వాడుతూనే ఉంటారు, అయితే కార్ లో ఏసీకీ సంబంధించిన ముఖ్యమైన కార్ ఏసీ ఫిల్టర్ గురించి మీకు తెలుసా? దీని గురించి చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు కానీ ఇది చాలా ముఖ్యమైనది, ఏసీ ఫిల్టర్ ని ఎప్పటికప్పుడు మార్చకపోతే (If not changed) కార్ ఏసి పాడవడంతోపాటు మనకి కూడా చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
మీ కారులోని క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్, దుమ్ము మరియు ఇతర హానికరమైన కాలుష్య (pollution) కారకాలను తొలగించడం ద్వారా లోపలి గాలిని శుభ్రం చేయడంలో ఎయిర్ ఫిల్టర్ సహాయపడుతుంది. ఈ ఫిల్టర్ కారు HVAC సిస్టమ్ ని ఉపయోగించుకొని గాలిని శుభ్రపరుస్తుంది. ఇది మీ కారులో గ్లోవ్‌బాక్స్ వెనుక కనిపిస్తుంది. మీరు మీ కారు నుండి ఏదైనా చెడు వాసన వస్తుంటే లేదా ఏసీ గాలి సరిగా రావట్లేదు అని గమనించినట్లయితే, మీరు క్యాబిన్ ఫిల్టర్‌ని మార్చాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకోవాలి.
ఇది సాధారణంగా కాగితం పై ఆధారపడిన మల్టీఫైబర్ కాటన్‌తో తయారు చేయబడిన చిన్న మడత యూనిట్. కారులోకి గాలి ప్రవేశించినప్పుడు, అది మొదట ఈ ఫిల్టర్ ద్వారా వెళుతుంది. గాలిలోని మలినాలను (impurities) ఫిల్టర్ చేసి మీకు స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది.
క్యాబిన్ ఫిల్టర్ మీరే స్వయంగా మార్చుకోవచ్చు
• క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్‌ను తీయడానికి, మీ సేఫ్టీ గ్లోవ్స్ ని ధరించండి.
• గ్లోవ్ బాక్స్ తెరిచి, దానిలో ఉన్న మీ వస్తువులను బయటికి తీయండి.
• గ్లోవ్ బాక్స్ నుండి గ్లోవ్ బాక్స్ డంపర్‌ను తీయండి. కొన్ని కార్లకు డంపర్ స్క్రూతో ఫిక్స్ చేసి ఉండవచ్చు.
• గ్లోవ్ బాక్స్‌ను బయటకు తీయడానికి, దాని రెండు వైపులా సున్నితంగా (gently) పట్టుకొని మీ వైపుకు లాగండి.
• కారు ఎయిర్ ఫిల్టర్ కోసం కవర్ గ్లోవ్ బాక్స్ వెనుక చూడవచ్చు.
• క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్‌ను పొందడానికి, కవర్‌కు ఇరువైపులా ఉన్న ట్యాబ్‌లను మెల్లగా లోపలికి నెట్టండి (push).
• క్యాబిన్ ఫిల్టర్‌ని హౌసింగ్ నుండి బయటకు తీయడానికి మీ వైపుకు లాగండి.
క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్‌లో మళ్ళీ ఎలా సెట్ చేయాలి :
• మీ పాత ఫిల్టర్ లాంటి సైజు మరియు డిజైన్ ఉన్న ఎయిర్ ఫిల్టర్‌ను మాత్రమే మీకు దగ్గర ఉన్న ఆటోమొబైల్ షాప్ లో ఎయిర్ ఫిల్టర్‌ను కొనుక్కోవాల్సి ఉంటుంది.
• మీరు కొత్త ఫిల్టర్‌ను ఉంచినప్పుడు, ఎయిర్‌ఫ్లో బాణం క్రిందికి ఎదురుగా ఉందని నిర్ధారించుకోండి.
• గ్లోవ్ బాక్స్‌ను తిరిగి లోపలికి, దాని స్థానంలో పెట్టేటప్పుడు, రెండు వైపులా దాని స్థానంలోకి తేలికగా పుష్ చేయండి.
• తిరిగి గ్లోవ్ డంపర్ పై గ్లోవ్ బాక్స్‌ను ఉంచండి.
• తిరిగి గ్లోవ్ బాక్స్ లోపల మీ వస్తువులను ఉంచండి
Comments are closed.