కోటి రూపాయలు సంపాదించాలి అనే లక్ష్యాన్ని సాధించడానికి వార్షిక స్టెప్ అప్ పద్దతి కాకుండా sip ద్వారా కూడా సంపాదించవచ్చు
Telugu Mirror : మీ లక్ష్యం రూ. 1 కోటి సంపాదించాలనా? ఎప్పటి లోగా సంపాదించాలని మీ ప్రణాళిక, ఐదు సంవత్సరాల లోపల, ఏడు, పది, పన్నెండు లేదా పదిహేను సంవత్సరాలు? అయితే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) లో దీర్ఘకాల పెట్టుబడులు పెట్టడం వలన సమీప భవిష్యత్ లో అద్భుతాలు జరుగుతాయని ఆదాయ రంగ నిపుణులు అంటున్నారు, ఇందుకు కారణం ఏమిటంటే పెట్టుబడిదారులు మ్యూచ్వల్స్ యొక్క మేలును పొందుతారు. మ్యూచువల్ ఫండ్ (MF) పెట్టుబడిదారులు వార్షిక స్టెప్-అప్(Step-Up) విధానం లేకుండా SIP లో పెట్టుబడుల ద్వారా కోటీశ్వరులు కావాలనుకుంటే, అది కూడా చాలా సాధ్యమే, అయితే కాలపరిమితి తో పాటు ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలనుకుంటున్న దాని మీద ఆధారపడి ఉంటుంది.
MFI, ఫండ్స్ ఇండియా రీసెర్చ్(Funds India Research) నుండి వచ్చిన నివేదిక ప్రకారం, రూ.10,000 SIP మొత్తం పెట్టుబడి పెట్టిన వారిని 20 సంవత్సరాలలో, రూ. 20,000 పెట్టుబడిదారుని 15 సంవత్సరాలలో, రూ .25,000 కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిన వారిని 13 సంవత్సరాలలో మరియు ₹ 30,000 కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిన వారు 12 సంవత్సరాలలో, నెలకు రూ.40,000 వార్షిక స్టెప్ – అప్ లేకుండా కేవలం SIP విధానములో పెట్టుబడి పెట్టిన వారిని 10 సంవత్సరాల కంటే ఎక్కువ సమయంలో కోటీశ్వరుడు అయ్యే అవకాశం ఉంది.
నెలవారీ రూ. 50,000 SIP విధానములో పెట్టుబడి మిమ్మల్ని సుమారు తొమ్మిది సంవత్సరాలలో లక్షాధికారిని చేస్తుంది. నెలవారీ రూ 75,000 పెట్టుబడి మిమ్నల్ని 7 సంవత్సరాలలో అదేవిధంగా రూ.1లక్ష SIP మొత్తం పెట్టుబడి పెట్టిన వ్యక్తిని 5సంవత్సరాల పది నెలల సమయంలో కోటీశ్వరునిగా మారుస్తుంది. ట్రాన్స్సెండ్ కన్సల్టెంట్స్లో వెల్త్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కార్తిక్ ఝవేరి(Health Management Director Karthik Jhaveri) లాంగ్ టర్మ్ ఈ క్విటీ లలో పెట్టుబడి దారులు కోరుకునే మ్యూచు వల్ ఫండ్ SIP రాబడి పై మాట్లాడుతూ , “ఒకరి SIPలో ఎక్కువ కాలం పాటు 12 నుండి 16% రాబడిని పొందవచ్చు.”
ఆప్టిమా మనీ మేనేజర్స్(Optima Money Managers) MD & CEO పంకజ్ మత్పాల్ మాటలలో, ” పెట్టుబడి దారులు మొదటిగా మ్యూచువల్ ఫండ్స్ యొక్క 15 X 15 X 15 సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. 15×15×15 నియమం తెలిపేది ఏమిటంటే ఒక పెట్టుబడిదారు 15సంవత్సరాల పాటు రూ.15,000 పెట్టుబడి పెడితే, దానినుండి 15% రాబడిని ఆశించవచ్చని ఇది పెట్టుబడి దారునికి మెచ్యూరిటీ మొత్తం విలువ రూ.1కోటి వరకు ఉంటుంది అని తెలిపారు.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్..కొత్త ఉద్యోగాల నోటిఫికెషన్స్ కి అప్లై చేసుకోండి త్వరగా..
జూలైలో రికార్డు స్థాయిలో మ్యూచువల్ ఫండ్ SIPలలో ఇన్ ఫ్లో
లాంగ్ టర్మ్(Long Term) రాబడిని పొందటానికి ఇన్వెస్టర్స్ SIPపై పెద్దగా బెట్టింగ్లు పెడుతున్నారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (Amfi) జూలై నివేదికను చూపించింది. ఈ డేటా ప్రకారం మేలో రూ.14,749pl కోట్ల ఇన్ ఫ్లో మరియు జూన్ లో ఉన్న రూ.14,734 కోట్ల కంటే జూలై లో నెలవారీ SIP యొక్క సహకారం ఎక్కువగా ఉంది , ఇది గతంలో కన్నా అత్యధికం.అయితే ఆసక్తి కరమైన విషయం ఏంటంటే అక్టోబర్ 2022 నుండి సిస్టమాటిక్ ఇన్వెష్ట్ మెంట్ ప్లాన్ (SIP)ల ద్వారా పెట్టుబడుల ప్రవాహం (ఇన్ఫ్లోలు) ₹ 13,000 కోట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి.
గమనిక: ఈ కథనం లో పేర్కొన్న అర్ధిక పరమైన అంశాలు, సిఫార్సులు వ్యక్తి గత విశ్లేషకుల అభిప్రాయాలు ఇవి TELUGU MIRROR వి కావు. ఏవైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్(Certified Financial Planners) ని సంప్రదించిన తరువాతనే పెట్టుబడులు పెట్టమని మేము సూచిస్తున్నాము.