Telugu Mirror Career

AICTE Excellent SSPCA Scheme 2024 : కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీం.. వారికి రూ.2 లక్షలు ఆర్ధిక సాయం.

AICTE Excellent SSPCA Scheme 2024

AICTE Excellent SSPCA Scheme 2024 : అంతర్జాతీయంగా ఉన్నత స్థాయిలో నిలబడాలి అని అనుకుంటున్నారా.. కానీ డబ్బు సమస్యతో వెనకడుగు వేస్తున్నారా? అయితే, ఎదగాలనే మీ పట్టుదలను చూసి కేంద్ర ప్రభుత్వం ఒక తీయటి కబురునిచ్చింది. ఆర్ధికంగా ఇబ్బంది పడుతూ తమ కళలను సాకారం చేసుకోలేకపోతున్నా విద్యార్థులకు ఇది మంచి వార్త అనే చెప్పుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇంతకీ ఆ పథకం దేనికి సంబంధించినది? ఎవరు అర్హులు? ఈ పథకాన్ని ఎలా పొందాలి అనే ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు సమాదానాలు చూద్దాం.

విద్యార్థులకు అండగా ఉండేందుకు AICTE SSPCA పథకాన్నీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దీనివల్ల విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో తమ స్కిల్స్, జ్ఞానాన్ని పెంపొందించుకోగలుగుతారు. ప్రపంచ స్థాయిలో తమ సామర్థ్యాన్ని చూపించాలని కోరుకునే విద్యార్థులకు AICTE ఆర్థిక సహాయం అందిస్తుంది. AICTE అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. అంతర్జాతీయ పోటీలలో (SSPCA) పాల్గొనే విద్యార్థులకు మద్దతు ఇస్తూ ఈ సంస్థ ఒక పథకాన్ని ప్రారంభించింది. చెప్పాలంటే, ఈ పథకం అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒక్కో విద్యార్థికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందుతుంది.

అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొనేందుకు ఒక విద్యార్థి రూ.2 లక్షలతో వెళ్లవచ్చు. విద్యార్థికి మెంటరింగ్, లాజిస్టికల్ సలహా కూడా అందిస్తారు. విద్యార్థికి మంజూరైన డబ్బులు ముందుగా ఇవ్వరు. ఆ డబ్బును రీయింబర్స్‌మెంట్‌ రూపంలో చెల్లిస్తారు. విద్యార్థికి అందించే డబ్బు దేశీయ మరియు విదేశీ ప్రయాణ ఖర్చులు, రిజిస్ట్రేషన్ ఫీజులు, వీసా దరఖాస్తు ఫీజులు, హోటల్ ఖర్చులు, విమానాశ్రయ తనిఖీలు, ప్రయాణ ఆరోగ్య బీమా వంటి ఛార్జీలను అందిస్తుంది.

AICTE Excellent SSPCA Scheme 2024

AICTE ఆమోదించిన విశ్వవిద్యాలయాలలో డిప్లొమా, BE/BTech, ఇంటిగ్రేటెడ్ MTech, ME/MTech, MBA, MCA మరియు హోటల్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లు చేస్తున్న విద్యార్థులకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. కంపిటీషన్ గడువు పది రోజులలోపు ఉండేలా చూసుకోవాలి. ఈ పథకం ఒక్కో విద్యార్థికి ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కోర్సు వ్యక్తిగత విద్యార్థులులేదా ఆరుగురు గ్రూప్లతో కలిసి పాల్గొనవచ్చు. విదేశాల్లో పోటీ చేయాలనుకునే విద్యార్థులు ముందుగా తమ దేశంలోనే పోటీపడి మొదటి స్థానంలో గెలవాలి.

దరఖాస్తు చేయడానికి, విద్యార్థులు తమ విశ్వవిద్యాలయం నుండి సంతకం చేసిన దరఖాస్తు ఫారమ్‌ను ఢిల్లీలోని AICTEకి సబ్మిట్ చేయాలి. విదేశాల్లో పోటీని నిర్వహించే వారు విద్యార్థి పేరుతోపాటు విద్యార్థి లేఖ కాపీని AICTEకి పంపుతారు. ఖర్చు గురించి అధికారులు కమిటీకి తెలియజేయాలి. విదేశాల నుంచి పోటీకి సంబంధించిన వివరాల కాపీని కూడా ఏఐసీటీఈకి ఇవ్వాలి. జాతీయ స్థాయిలో ఫస్ట్ వచ్చిన డాక్యుమెంట్ కాపీని కూడా చేర్చాలి. విదేశాలకు ఈవెంట్ ప్రారంభానికి మూడు నెలల ముందు డాక్యూమెంట్లను పంపాలి.

నిపుణుల కమిటీ విద్యార్థి పంపిన రిక్వెస్ట్ ను పరిశీలిస్తుంది. క తర్వాత ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత పూర్తి వివరాలు ఏఐసీటీఈకి చెబుతారు. ఏఐసీటీఈ చివరి నిర్ణయం తీసుకుంటుంది. పోటీ తర్వాత, మొత్తం ఖర్చు రీయింబర్స్‌మెంట్‌ రూపంలో అందిస్తారు. మరింత సమాచారం కోసం, https://www.aicte-india.org/schemes/students-development-schemes అధికారిక పోర్టల్‌ని సందర్శించండి.

AICTE Excellent SSPCA Scheme 2024