Air India : విమానంలో ప్రయాణించడానికి సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వ్యక్తుల కోసం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఒక మంచి శుభవార్త తెలిపింది. మీరు బస్సులో ప్రయాణించే ఖర్చుతో ఇప్పుడు విమానంలో ప్రయాణించే అవకాశం ఉంది. విమానం లో ప్రయాణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి కళ ఎట్టకేలకు సాకారం కానుంది.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ టైమ్ టు ట్రావెల్ సేల్‌ను (Time to Travel Sale) ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ తో కేవలం బస్ ఛార్జీలకే విమానంలో ప్రయాణించవచ్చు. ఎయిర్ ఇండియా ఈ టిక్కెట్లను Air India Express.com, ఎయిర్‌లైన్ వెబ్‌సైట్ మరియు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవడానికి వీలు కల్పించింది.
ఎయిర్ ఇండియా టైమ్ టూ ట్రావెల్ ( (Time to Travel) ఆఫర్ ఈ మధ్యనే ప్రారంభమైంది. ఇది జూన్ 3 వరకు వర్తిస్తుంది. ఇప్పుడు బుక్ చేసుకున్న వారు సెప్టెంబర్ 30 వరకు స్థానికంగా మరియు అంతర్జాతీయంగా ప్రయాణించడానికి తమ టిక్కెట్లను ఉపయోగించవచ్చు.
టైమ్ టు ట్రావెల్ ఆఫర్ కింద విమాన టిక్కెట్లు రూ.1,177 నుండి ప్రారంభమవుతాయి. ట్రావెల్ వెబ్ సైట్ల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.1,198 నుంచి టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.
అంతేకాకుండా విమాన ప్రయాణికులకు మరో ఆఫర్ కూడా ఉంది. 3 కేజీల వరకు క్యాబిన్ బ్యాగేజ్(Cabin baggage)ను ఎలాంటి చార్జీలు లేకుండా ప్రిబుక్ చేసుకోవచ్చు. చెకిన్ బ్యాగేజ్‌కు డిస్కౌంట్ రేట్లు ఉన్నాయి. డొమెస్టిక్ ఫ్లైట్స్‌కు (Domestic flights) అయితే రూ.1000 నుంచి, అదే ఇంటర్నేషనల్ రూట్లలో అయితే రూ. 1300 నుంచి ఈ రేట్లు స్టార్ట్ అవుతాయి.
ఎయిర్ ఇండియా ప్రత్యేక సభ్యుల బ్యాగేజీ తగ్గింపు మరియు నియో పాస్ రివార్డ్ ప్రోగ్రామ్‌ల సభ్యులకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇంకా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ హాట్ మిల్స్, సౌకర్యవంతమైన సీట్లు మరియు ప్రత్యేకమైన రివార్డ్ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది.
ఎయిర్ ఇండియా అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త టైమ్ టు ట్రావెల్ ఆప్షన్‌ను రూ.1,799తో విమాన టిక్కెట్‌తో బుక్ చేసుకోవచ్చు. లాయల్టీ మెంబర్స్, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, ఎస్ఎంఈ, డిపెండెంట్స్, సాయుధ దళాల సభ్యులు ఈ ప్రత్యేక ఆఫర్ పొందేందుకు అర్హులు.