Alert For Gas Consumers: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఆలా చేయకుంటే ఇక సిలిండర్ రానట్టే.
తమ పేర్ల మీద సిలిండర్లు ఉన్నవారు గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి సిలిండర్ తీసుకుంటున్న వ్యక్తి KYC చేసుకోవాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ గతేడాది కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.
తమ పేర్ల పై సిలిండర్లు ఉన్నవారు గ్యాస్ ఏజెన్సీ (Gas Agencies) కి వెళ్లి తమ ఆధార్ (Aadhar Card) ఇవ్వాలని గత ఏడాది కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు, దీని కోసం ఎటువంటి గడువు విధించబడలేదు, కానీ ఇప్పుడు మే 31 వరకు సమయం ఇచ్చారు. ఈ వెరిఫికేషన్ కోసం ప్రజలు తమ ఆధార్ కార్డులతో KYC సెంటర్ లకు వెళ్లాల్సి ఉంటుంది.
గ్యాస్ ఏజెన్సీ లకు ఇ-కెవైసి (E-KYC) చేయడానికి యంత్రాలను కూడా ఇచ్చారు. గ్యాస్ కనెక్షన్లో పేరు ఉన్న వ్యక్తి బొటనవేలు ముద్ర వేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం, e-KYC పూర్తి చేయని వ్యక్తులు సిలిండర్ సబ్సిడీ పొందలేరు. అటువంటి పరిస్థితిని నివారించడానికి, వెంటనే KYCని పూర్తి చేయండి.
బోగస్ పేర్లను ఉపయోగించే కనెక్షన్లు బ్లాక్ చేయబడతాయి :
కొత్త కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల కారణంగా, తప్పుడు పత్రాలు అందించి సిలిండర్లు పొందిన వారి సిలిండర్ల పై నిషేధం విధించబడుతుంది. ఆన్లైన్ బుకింగ్ (Online Booking) లు ఉండవు. ఒక ఇంట్లో ఒకే పేరుతో రెండు కంటే ఎక్కువ సిలిండర్లు ఉంటే, రెండో సిలిండర్ ఆటోమేటిక్‌గా బ్లాక్ అవుతుందని కొత్త చట్టం స్పష్టం చేస్తోంది. అంటే ఒక ఇంటిలో ఒకే పేరుతో ఒకే సిలిండర్ ఉంటుంది.
అక్రమ కనెక్షన్లన్నింటినీ నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అలాంటి వ్యక్తులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యను ఏర్పాటు చేసింది. అలా కాకుండా ఎవరైనా ఒకే నివాసంలో ఎక్కువ సిలిండర్లను ఉంచుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి కనెక్షన్ల పై విచారణ జరపాలని గ్యాస్ కంపెనీలను కూడా ఆదేశించింది.
ఉజ్వల పథకం ద్వారా బిపిఎల్ (BPL) వ్యక్తులకు రూ.372 మరియు ఇతర కనెక్షన్లు ఉన్నవారికి రూ.47 సబ్సిడీని అందిస్తుంది. ఉజ్వల పథకంలో నమోదు చేసుకున్న వారు ధృవీకరణ కోసం తప్పనిసరిగా గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లి వెరిఫికేషన్ చేయించుకోవాలి.
గ్యాస్ కస్టమర్ నంబర్, అడ్రస్ ప్రూఫ్‌గా ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, లీజింగ్ అగ్రిమెంట్, ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, రాష్ట్ర లేదా ప్రభుత్వ సర్టిఫికేట్ వంటి పత్రాలు గుర్తింపు, ఫోటోకాపీ (Photo Copy) లేదా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ (Driving license) తప్పనిసరిగా సమర్పించాలి. బయోమెట్రిక్ వెరిఫికేషన్ (Bio Metric Verification) చేయడం వల్ల సిలిండర్ల బ్లాక్ (Cylinder Block) మార్కెటింగ్ చాలా వరకు తగ్గుతుంది. దీని వల్ల నిరుపేదలకు సరైన సమయంలో సిలిండర్ అందుతుంది.
Comments are closed.