Telugu Mirror : బియ్యం, రేషన్ సమాగ్రి తీసుకోవటానికే కాకుండా ప్రజల ఆర్థిక పరిస్థితులను కూడా రేషన్ కార్డుల ద్వారా తెలుసుకోవచ్చు. వారు బిలోప్రావర్టీ లైన్ కు చెందిన వారా లేక అబౌవ్ ప్రావర్టీ లైన్ కు చెందిన వారా అని తెలుపుతాయి. తద్వారా వారి ఆదాయ వివరాలను అంచనా వేసి అధికారులు ఆధాయ ద్రువీకరణ పత్రాలను మంజూరు చేస్తారు. కొన్ని సందర్భాల్లో రేషన్ కార్డులో చాలా తక్కువ ఆదాయం ఉండి, ఇళ్లు లేని వారికి ప్రభుత్వాలు ప్లాట్స్ ఇచ్చి ఇళ్లు సైతం నిర్మించి ఇస్తాయి.
ఇంకా అనేక అవసరాలకు ఉపయోగపడే రేషన్ కార్డుల్లో బోగస్ కార్డులను ఎత్తివేయాలని ప్రభుత్వం ఈ కేవైసీని తీసుకొచ్చింది. దీని ద్వారా కార్డులో ఉన్నవారందరూ ఈ కేవైసీ చేయించుకోవటం ద్వారా ఆ కార్డులు సక్రమమే అని తేల్చనున్నది ప్రభుత్వం. ఈ కేవైసీ చేయకపోతే అవి పేక్ కార్డులుగా నిర్దారణ చేయనున్నది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డులకు ఈ కేవైసీ చేయించుకునే గడువు ఈ నెల 31తో ముగినున్నది. దీంతో ప్రజలు రేషన్ షాపుల నంద బారులు తీరారు.
Also Read : Tecno Spark 20 : భారత్‌లో లాంచ్ కానున్న Tecno Spark 20; కంపెనీ టీజర్ లో వెల్లడి
ఈకేవైసీ చేయించుకోవటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడవు పెంచాలని ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు ప్రభుత్వం స్పందించింది. ఫిబ్రవరి చివరి వరకు ఈ-కేవైసీకి అవకాశం ఇస్తున్నట్లు రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖ ప్రకటించింది. ఈ కేవైసీ చేయించుకోని వారు గడువులోగా చేయించుకోవాలని సివిల్ సప్లయ్ శాఖ కోరింది. గడువు పెంపుపై హర్షం వ్యక్తం చేసిన ప్రజలు.. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
కొత్త రేషన్ కార్డులను ఇస్తామని ప్రస్తుత పాలకులు చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా స్వీకరిస్తున్న డేటా కాంగ్రెస్ సర్కారుకు ఉపయోగపడునుంది. ఈ డేటా ప్రకారమే రేషన్ కార్డులు మంజూరు చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తున్నది. కాబట్టి ఇంకా ఈకేవైసీ చేయించుకోవాని వాల్లు త్వరాగా రేషన్ షాపులకు వెళ్లీ ఈ కేవైసీ చేయించుకోండి…
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ప్రధానమైన 500రూపాయలకు గ్యాస్, మహిళలకు 2500 రూపాయలు, ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్లు లేని వారికి ఇంటిస్థలం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ లాంటి పథకాలను తెల్ల రేషన్ కార్డు దారులకే అమలు చేసే ఛాన్స్ ఉన్నది. ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభత్వాలు తీసుకురాబోయే పథకాలకు రేషన్ కార్డునే ప్రమాణికంగా తీసుకునే అవకాశాలు సైతం ఉన్నాయి. తెల్లరేషన్ కార్డుల ద్వార ఇన్ని ప్రయోజనాలుంటాయి. కాబట్టి ఈకేవైసీని పొరపాటున కూడా మర్చిపోవద్దు. ఎంతవీలైతే అంత త్వరాగా ఈకేవైసీ చేయించుకోవటం మంచిది.