Ali Express: నాలుగు సంవత్సరాల తరువాత వచ్చిన ఆన్ లైన్ డెలివరీ. అలీ ఎక్స్ ప్రెస్. ఆశ్చర్య సంఘటన

ఇప్పుడు ఆన్ లైన్ షాపింగ్(Online Shopping) అంటే గుర్తొచ్చేది అమెజాన్(Amazon) మరియు ఫ్లిప్ కార్ట్(Flipkart). కానీ ఒకప్పుడు ఎన్నో ఆన్ లైన్ షాపింగ్ అప్ లు ఉన్నాయి. అలాంటి షాపింగ్ యాప్ లలో అలి ఎక్స్ ప్రెస్(Ali Express) ఒకటి. కానీ భారత ప్రభుత్వం వారు బ్యాన్ చేసిన చైనా యాప్ లలో అలి ఎక్స్ ప్రెస్ ఒకటి. కానీ ఢిల్లీ లోని ఒక వ్యక్తి తాను అలి ఎక్స్ ప్రెస్ నుంచి ఆర్డర్ చేసిన వస్తువు నాలుగు సంవత్సరాల తర్వాత తన ఇంటికి వచ్చింది. అయితే ఈ విషయాన్ని తను ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నాడు.

ఢిల్లీకు చెందిన నితిన్ అగర్వాల్ 2019 లో అలి ఎక్స్ ప్రెస్ నుంచి ఒక వస్తువుని ఆర్డర్ చేసాడు. తన ఆర్డర్ ఇంటికి వచ్చిన విషయాన్ని ట్విట్టర్ లో తెలిపాడు.

” నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోకండి! నేను 2019లో అలి ఎక్స్ ప్రెస్ ( ఇప్పుడు ఇండియాలో బ్యాన్ అయింది ) నుండి ఆర్డర్ చేశాను. అది ఇవాళ ఇంటికి వచ్చింది ” – అని నితిన్ అగర్వాల్ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ బాగానే పాపులర్ అయ్యింది. ఈ ట్వీట్ కు కొంత మంది ఇలా రిప్లై ఇచ్చారు – ” నేను కూడా 2019 డిసెంబర్ లో 2 ప్రొడక్ట్ లను ఆర్డర్ ఇచ్చాను, అవి కూడా ఎప్పుడో వస్తాయని నమ్మకం ఉంది.” ” ఇలా ఎలా జరిగింది? నేను కూడా 2017-19 మధ్యలో ఆర్డర్ చేశాను. అవి ఇంకా రాలేదు, నేను వాటికి డబ్బులు కూడా ఇచ్చాను “.

భారత ప్రభుత్వం 58 చైనా యాప్ లను 2020 లో బ్యాన్ చేసింది. ఆ బ్యాన్ అయిన యాప్ లలో షాపింగ్ యాప్ ల నుంచి ఆర్డర్ చెయ్యాలని అనుకుంటే. థర్డ్ పార్టీ సర్వీసులను ఉపయోగించి ఆర్డర్ చెయ్యవచ్చు కానీ చార్జెస్ మాత్రం ఎక్కువ తీసుకుంటారు. లేదా VPN ను వాడి ఈ బ్యాన్ అయిన యాప్ లను ఉపయోగించవచ్చు. VPN వాడటం ద్వారా మనం వేరే దేశంలో ఉన్నట్లుగా చూపిస్తుంది. కానీ ఇలా VPN తో బ్యాన్ అయిన యాప్ లను వాడటం మంచిది కాదు.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in