Amazing Bike Tips : మండే ఎండల్లో బైక్ సేఫ్ గా ఉండాలా? ఈ టిప్స్ మీ కోసమే
ఎండాకాలంలో బైక్ సేఫ్ గా,ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి.
Amazing Bike Tips : వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎండ వేడిమికి అల్లాడిపోతున్నాం. ఉదయం 9 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్ళకూడదు. బయటికి వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఎండ తీవ్రతకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఒకవైపు వేసవి వేడికి గురికాకుండా ఉండేందుకు మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరి వాహనాల పరిస్థితి ఏమిటి? తీవ్రమైన వేడి టూ-వీలర్ వాహనానికి సమస్యలు రావొచ్చు.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబంలో టూ-వీలర్ వాహనాలు నడుపుతున్నారు. అయితే, ఎండ వేడిమి కారణంగా వాహనాలకు అనేక సమస్యలతో తలెత్తుతాయి. వీటిలో ఒకటి ఇంజిన్ కి సంబంధించిన సమస్య. ఇది కాకుండా టైర్లు, పెట్రోలు ఇబ్బందులు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో చాలా మందికి తెలియదు.
వేడి ఉష్ణోగ్రతలలో (Temperatures) బైక్‌తో సమస్యలు తలెత్తుతాయి. ఇంజిన్ (Engine) బాగా వేడెక్కుతుంది, టైర్లు విపరీతంగా వేడిగా మారతాయి మరియు ఈ సమస్యలు బైక్ వెనుక భాగంలో చాలా ఒత్తిడిని కలిగిస్తాయి.
బైక్ ఇంజిన్ సమస్యలను పరిష్కరించడానికి అనేక విధానాలు ఉన్నాయి. సాధారణంగా రెండు రకాల బైక్ ఇంజన్లు ఉంటాయి. గాలితో చల్లబడే ఒక రకమైన ఇంజిన్. మరొకటి లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ (Liquid cooled engine). ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. అలా అయితే, ఇంజిన్ త్వరగా చల్లబడుతుంది. లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ విషయంలో, బైక్‌లో తగినంత లిక్విడ్ ఉండేలా చూసుకోవాలి.
స్టార్టింగ్ లో ఈ చర్యలు తీసుకుంటే, తీవ్రమైన వేడిలో కూడా బైక్‌కు (Bike) ఎలాంటి ఇబ్బందులు రావు . అలా కాకుండా, ఎక్కువ సమయం పాటు బైక్‌ను నడపడం కూడా అంత మంచిది కాదు. ఎక్కువ దూర ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు వీలైనంత వరకు ఆగుతూ ఉంటూ వెళ్తే మంచిది. లేదంటే బైక్‌పై ఎఫెక్ట్ చూపుతుంది. బైక్ ఇంజిన్ మరియు టైర్లపై ఒత్తిడి పెరుగుతుంది.
Comments are closed.