Telugu Mirror : పండుగ సీసన్ వస్తే ఇ -కామర్స్ వెబ్సైట్స్ అయిన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటివి ఎన్నో ఆఫర్స్ అందుబాటులోకి తీసుకొస్తాయి. ఇప్పుడు వినియోగదారులకు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.ఈ సేల్ ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్స్ , స్మార్ట్ వాచెస్ మరియు గృహ ఉపకరణాలపై కస్టమర్లను ఆకట్టుకునేందుకు భారీ తగ్గింపులను అందిస్తుంది. ఒకవేళ మీరు ఈ పండుగ సమయంలో కొత్త స్మార్ట్ ఫోన్స్ కొనాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే ఈ అవకాశం ఇప్పుడు మీ కోసం. ఈ సేల్ లో అధిక డిస్కౌంట్లు కలిగి ఉన్న స్మార్ట్ ఫోన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
యాపిల్ ఐఫోన్ 13 ఫోన్ :
ఐఫోన్ 13 ఫోన్ రూ.59,900 ధరకు అమ్ముతున్నారు. కానీ అదే ఐఫోన్ 13 ఇప్పుడు ఈ విక్రయ సేల్ లో రూ.48,999కి అందుబాటులోకి ఉంది. ఈ ఫోన్ 12+12 మెగా పిక్సల్స్ ల రియల్ డ్యూయల్ కెమెరాలతో ఉండగా, సూపర్ రెటీనా డిస్ప్లే మరియు మెరుగైన బ్యాటరీ ని కలిగి ఉంది. ఇది ఎక్స్చేంజ్ ఆఫర్స్ ని కూడా కలిగి ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ తో మీరు మరింత తగ్గింపును పొందవచ్చు.
రెడ్ మీ నోట్ 13 5G :
అమెజాన్ వెబ్సైటు లో రెడ్ మీ నోట్ 13 5G ఫోన్ రూ. 17,999 కి విక్రయించగా రిపబ్లిక్ సేల్ లో రూ. 1000 తగ్గింపుతో రూ.16,999కి అందుబాటులో ఉంది.
Also Read : Nothing phone 2 : ఫ్లిప్‌కార్ట్ లో నథింగ్ ఫోన్ 2 పై రూ.10,000 తగ్గింపు, వార్షిక రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం
శాంసంగ్ గాలక్సీ ఎస్23 5G ఫోన్ :
శాంసంగ్ గాలక్సీ ఎస్23 5G ఫోన్ రూ.89,999 ధరకు విక్రయించబడుతుంది కానీ ఈ అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ లో శాంసంగ్ గాలక్సీ ఎస్23 అతి భారీ తగ్గింపుతో ప్రస్తుతం రూ.54,999 మాత్రమే లభిస్తుంది. 256GB స్టోరేజ్ కెపాసిటీతో 8GB RAM తో అందుబాటులో ఉంది. Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తో శాంసంగ్ గాలక్సీ ఎస్23 5G ఫోన్ పని చేస్తుంది.
హానర్ 90 ఫోన్ :
మీరు హానర్ 90 ఫోన్ ని కొనుగోలు చేయాలనుకుంటే విక్రయ సేల్ లో రూ.28,999కి లభిస్తుంది. SBI కార్డు తో అదనంగా మరో రూ.2,250 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ పై అమెజాన్ రిపబ్లిక్ సేల్ లో 40% వరకు తగ్గింపుని అందిస్తుంది.
iQOO z7 5G :
iQOO Z7 5G ఫోన్ 38 % తగ్గింపుతో లభిస్తుంది. 6.3 అంగుళాల డిస్ప్లే ని కలిగి ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.23,999కి విక్రయించగా, ప్రస్తుత సేల్ లో రూ. 14,999కి అందుబాటులో ఉంది. ఇది OIS ఫీచర్ తో 64-మెగా పిక్సెల్ రియల్ షూటర్ మరియు స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.