Amazon One Plus Phone: అమెజాన్ నుండి వన్ ప్లస్ ఫోన్ పై సూపర్ డిస్కౌంట్, 40వేల ఫోన్ కేవలం రూ. 26,000లకే లభ్యం

Amazon One Plus Phone

Amazon One Plus Phone: అతిపెద్ద ఇ-కామర్స్ దిగ్గజ కంపెనీలు ప్రస్తుతం పండుగలు, ఇతర ప్రత్యేక సందుదర్భాలకు సంబంధం లేకుండా కస్టమర్లకు ఆఫర్ ల మీద ఆఫర్లు అందిస్తున్నాయి. గతంలో పండుగల సమయంలో మాత్రమే డిస్కౌంట్లు ఇచ్చేవారు. కానీ, ప్రస్తుతం ఎప్పటికప్పుడు గణనీయమైన తగ్గింపులను అందిస్తున్నారు. ఇందులో భాగంగానే అమెజాన్ తాజాగా OnePlus ఫోన్‌లపై గణనీయమైన తగ్గింపును ప్రకటించింది.

OnePlus 11R స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అధిక తగ్గింపుతో అమ్మకానికి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 39,999, కానీ Amazonలో 30% తగ్గింపుతో, ఇది కేవలం రూ. 27,999 లభ్యం కానున్నది. అలా కాకుండా, మీరు కొనుగోలు చేయడానికి మీ Amazon Pay బ్యాలెన్స్‌ని ఉపయోగిస్తే, మీకు అదనంగా రూ. 839 క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు.

కానీ, ఈ ఆఫర్ మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకున్నందుకు కూడా తగ్గింపును పొందవచ్చు. మీ పాత ఫోన్ స్థితిని బట్టి, గరిష్టంగా రూ. 26,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్ ఫీచర్లలో 8 GB RAM మరియు 128 GB స్టోరేజ్ ఉన్నాయి.

Also Read: Vivo T3 Lite : వివో నుంచి 5G స్మార్ట్‌ఫోన్‌.. రూ.12000 కంటే తక్కువ ధర.

ఈ ఫోన్ 6.7-అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2772 x 1240 పిక్సెల్ రిజల్యూషన్ తో పని చేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 CPU పరిచయం చేశారు. ఇక కెమెరా విషయానికి వస్తే, 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంది. ఇది సెల్ఫీలు తీసుకోవడానికి మరియు వీడియో కాల్స్ చేయడానికి 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13 రన్నింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. స్టీరియో స్పీకర్లు, డ్యూయల్ సిమ్ మరియు వేగవంతమైన ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 100 వాట్స్ సూపర్ ఉక్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తూ.. 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in