Ambassador Latest Model: ఆ రాజసం మళ్లీ వచ్చేస్తోంది, సరికొత్త ఫీచర్స్ తో రానున్న “కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్” ఎంత ధర ఉండొచ్చంటే?
సరికొత్త అవతారంలో త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. అంబాసిడర్ 2.0 గా మార్కెట్లోకి రానుందని ఆ సంస్థ ప్రకటించింది.
Ambassador Latest Model: ఒకానొక సమయంలో అంబాసిడర్ కార్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పట్లో అంబాసిడర్ కారు నడపడం స్టేటస్ సింబల్‌గా భావించేవారు. అంబాసిడర్ ఆటోమొబైల్స్ 1957 మరియు 2014 మధ్య ఉత్పత్తి చేయబడ్డాయి. ఈ కార్లు అప్పుడప్పుడు కనిపించినప్పటికీ, క్రమంగా అదృశ్యమవుతున్నాయి. హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ (Hindustan Motor Company) కి చెందిన అంబాసిడర్ కార్ల అమ్మకాలు క్రమంగా క్షీణించడంతో, ఈ వాహనాలు తరచుగా కనిపించడం లేదు. హిందూస్థాన్ మోటార్స్ (Hindustan Motors) కంపెనీ ఈ వాహనాల ఉత్పత్తిని నిలిపివేసింది, ఇది ఆటోమొబైల్ వ్యాపారంలో వివాదానికి కారణమైంది. దీంతో అంబాసిడర్ కార్ల అభిమానులు అసంతృప్తికి గురయ్యారు.
ఈ నేపథ్యంలో అంబాసిడర్ ఆటోమొబైల్స్ కొన్నేళ్ల తర్వాత మళ్లీ మార్కెట్లోకి రానున్నట్టు తెలుస్తోంది. ఈసారి, నేటి కస్టమర్లు కోరుకునే మరింత ఆధునిక లక్షణాలతో కార్పొరేషన్ అంబాసిడర్ వాహనాలను సిద్ధం చేస్తోంది. ప్రస్తుత అవసరాల ఆధారంగా అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్‌ను విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. అంబాసిడర్ కొత్త ఆటోమొబైల్స్ సరికొత్త డిజైన్ మరియు ఆకర్షణీయమైన ఫీచర్లతో రానున్నాయి. ఇప్పటికే కొన్ని ప్లాంట్లలో ఈ వాహనాల ఉత్పత్తి ప్రారంభమైందని పేర్కొన్నారు. హిందూస్థాన్ కంపెనీ ఈ సరికొత్త అంబాసిడర్ వాహనాలను మార్కెట్లోకి మళ్లీ ప్రవేశపెట్టేందుకు యూరోపియన్ కంపెనీ (European Company) తో జతకట్టింది.
ఒకప్పుడు ఆటో మొబైల్ రంగంలో సంచనలం సృష్టించిన అంబాసిడర్ కార్ల (ambassador cars) పై ఇప్పటికీ జనాల్లో మోజు ఉంది. ఈ క్రమంలోనే అప్ డేట్ వర్షన్ (UpDated Version) రెడీ చేసి మార్కెట్ లో మరోసారి చక్రం తిప్పాలని హిందూస్థాన్ మోటార్స్ భావిస్తోందట. ఈ కొత్త కార్లు ఎప్పుడు మార్కెట్ లోకి వస్తాయనే దానిపై అతి త్వరలో క్లారిటీ రానుంది. అంబాసిడర్ లుక్ ఉండేలాగా ఆధునిక ఫీచర్స్ తో మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక దీని ధర కూడా కాస్తా తక్కువగా ఉండేలాగా కంపెనీ ప్రణాళిక చేస్తోంది రూ.10 లక్షల నుంచి ధర ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
Comments are closed.