Telugu Mirror : మరో 10 రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ పార్టీ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ అనే పేరుతో ఈ మేనిఫెస్టోను విడుదల చేసారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సకల జనుల సౌభాగ్య పేరుతో ఈ ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ ప్రధాని నరేంద్రమోదీ గ్యారెంటీ ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో మరియు కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు బాగా అమలవుతాయన్నారు. గతంలో వాజ్‌పేయి మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం రూ.2.15 లక్షల కోట్లు ఇచ్చింది అని అమిత్ షా తెలిపారు.
Also Read : IND vs AUS : 20 ఏళ్ల తర్వాత ఫైనల్‌లో ఇండియా-ఆస్ట్రేలియా, వేదిక, తేదీ మరియు మ్యాచ్ సమయాలు.
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ఇచ్చామన్నారు. తెలుగు రాష్ట్రాలకు మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కేటాయించామన్నారు. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో కేంద్ర పథకాల అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను బీజేపీ ప్రతిపాదించింది. సంక్షేమ గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని, అన్ని అవినీతి ఆరోపణలపై రిటైర్ అయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ చేస్తారని మరియు ప్రతి 6 నెలలకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేస్తామని హామీ ఇచ్చింది.
పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గిస్తామని, కుటుంబానికి 10 లక్షల రూపాయల బీజేపీ ఆరోగ్య బీమా ఉంటుందని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. హైదరాబాద్ లో మ్యూజియం మరియు స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని అమిత్ షా చెప్పారు. కేంద్రంలో మరియు రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు తొందరగా అమలు అవుతాయని అమిత్ షా పేర్కొన్నారు.
Also Read : UPI ID DEACTIVATION : మీ యూపీఐ ని ఉపయోగించడం లేదా అయితే త్వరలో మీ ID డీయాక్టివేట్ చేయబడవచ్చు
ధరణి స్థానంలో మీ భూమి యాప్, ఉద్యోగస్తులు, పింఛనర్లకు ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు, గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ ఏర్పాటు, నాలుగు శాతం ముస్లింల రిజర్వేషన్ల ఎత్తివేత, బీఆర్ఎస్ పార్టీ అవినీతిపై విచారణకు కమిటీ, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కొత్త ఇళ్ల నిర్మాణం, ఇంటి పట్టాలు అందజేత మరియు ప్రధానమంత్రి పంటబీమా పథకం ద్వారా రైతులకు ఉచిత పంటబీమా అందిస్తాము అని అమిత్ షా తెలిపారు.