Telugu Mirror: నిత్యం తన మనస్సుకు నచ్చిన అంశాల పై ట్విట్టర్(Twitter)ద్వారా స్పందించే మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర(Anand Mahindra)తాజాగా చేసిన ట్వీట్ మరోసారి వైరల్ అయింది. అయితే ఈ సారి ఆనంద్ మహీంద్ర ట్వీట్ కు అదే స్థాయిలో వచ్చిన రిప్లై కూడా తోడవడం.ఇంతకీ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేసింది నటుడు షారూఖ్ ఖాన్(sharukh Khan) గురించి. దీనికి అదే రేంజ్ లో షారూఖ్ రిప్లై అభిమానులను ఆకట్టుకుంది.
మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర షారూఖ్ ఖాన్ జవాన్ చిత్రం గురించి చేసిన అభినందనకు షారూఖ్ ఖాన్ తన సహజ శైలిలో చమత్కారంగా,తన బుద్దిని ఉపయోగించి జవాబిచ్చాడు.
షారుఖ్ ఖాన్ రాబోయే “జవాన్(Jawan)” చిత్రం లోని “జిందా బందా” పాటలో షారుఖ్ ఖాన్ యొక్క ఎనర్జీ లెవల్స్ ని ప్రశంసిస్తూనే 57 సంవత్సరాల వయస్సులో హీరో యొక్క “వృద్ధాప్య సిస్టమ్ గురుత్వాకర్షణ శక్తిని బహిరంగంగా వ్యతిరేకిస్తుంది” అని ట్వీట్ లో వ్యాఖ్యానించాడు.
Also Read:Baby Movie: బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బేబీ .. తెర వెనుక రహస్యాలు మీకు తెలుసా ?
ఆనంద్ మహీంద్రా ఇచ్చిన ప్రశంసని రీట్వీట్ చేసిన షారుఖ్ ఖాన్ అతని భావాలను వ్యక్తపరచాడు. జీవితం చాలా చిన్నది మరియు వేగంగా పరిగెడుతుంది. నాకు సాధ్యమైనంత వినోదాన్ని పంచుతూ జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తాను.హాస్యం,కన్నీళ్ళు,డ్యాన్స్,అలాగే ఎగరడం ద్వారా ప్రజలకు ఆనందాన్ని కలిగించాలని తాను లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నానని,
కొంతమంది కలలు కనేలా మరియు కొన్ని క్షణాల సంతోషం కోసం స్టార్స్ తో స్విమ్ చేయాలనే ఆశను నెరవేర్చాలని కోరుకుంటున్నట్లు షారుఖ్ ఉద్ఘాటించాడు.
షారుఖ్ ప్రతిస్పందించిన తీరుకు అతని అభిమానులు ఫిదా అయినారు.వారు కూడా స్పందించడమే కాకుండా బాలీవుడ్ బాద్షా షారుఖ్ పై తమకున్న ప్రేమనీ,అభిమానాన్ని వ్యక్తంచేశారు. “జిందా బందా” పవరింగ్ యూత్, ఫైన్ వైన్ వంటి వృధ్యాప్యానికి సరిపోలే ఉదాహరణ,అని ఒక అభిమాని కామెంట్ చేశాడు. మరొకరు షారుఖ్ ఆల్ టైమ్ గ్రేట్ అని కామెంట్ చేశారు.
This hero is 57 years old?? Clearly his ageing process defies gravitational forces! He’s 10X as alive as most people. #ZindaBanda ho to aisa…
https://t.co/3Qaa2iC30U— anand mahindra (@anandmahindra) August 1, 2023
షారూఖ్ ఖాన్ రాబోయే చిత్రం “జవాన్” లోనిది “జిందా బందా”సాంగ్. దీని ట్రాక్ ని ఇటీవల విడుదల చేశారు. చాలా కాలం తరువాత షారుఖ్ ఖాన్ నృత్యం లోని నైపుణ్యం మరియు ఎనర్జీ ని చూపించింది.
రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్(Red Chillies entertainment) పై గౌరీ ఖాన్ నిర్మించిన జవాన్ చిత్రం సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషలలో రిలీజ్ అవుతుంది.ఈ చిత్రం ద్వారా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకుడిగా,స్టార్ హీరోయిన్ నయనతార(Heroine Nayanatara) బాలీవుడ్ లోకి అడుగు పెట్టనున్నారు.